RGV..ఆషు రెడ్డి, అరియనా వీరిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ తమ పరిచయాన్ని పాపులారిటీని పెంచుకున్నారని చెప్పవచ్చు.. ముఖ్యంగా వీరిద్దరూ ఒక ఆర్టిస్టుగా కంటే హాట్ బోల్డ్ బ్యూటీలుగా పేరుపొందారు. వీరిద్దరి క్రేజ్ సంపాదించుకోవడానికి ముఖ్య కారణం రాంగోపాల్ వర్మ(RGV )అని చెప్పవచ్చు. వర్మ వల్లి వీరిద్దరూ ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక హోదా అని సంపాదించుకున్నారు.అటువంటిది నిన్నటి రోజున రాంగోపాల్ వర్మ పుట్టినరోజు కావడం చేత ఆయనకు అసలు విష్ చేయలేదు అన్నట్లుగా తెలుస్తోంది.
అసలు వీరందరి మధ్య ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం .టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు.. మొదట్లో మంచి బ్లాక్ బాస్టర్ చిత్రాలను తెరకెక్కించిన ఈయన దర్శకుడుగా మంచి పేరు పొందారు. ఆ తర్వాత చిన్న హీరోలను స్టార్ హీరోలుగా మార్చారు. ఎంతోమంది నటీ నటులను సైతం ఇండస్ట్రీకి పరిచయం చేశారు వర్మ.వాస్తవానికి వర్మకు ఎవరి పైన దృష్టి పడిందంటే చాలు ఇక వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అని చెప్పవచ్చు.
ఇప్పటికీ ఎంతోమంది నటీమణుల లైఫ్ని సెటిల్ చేశారు. వర్మ ఈమధ్యనే ఈయన స్టైల్ మొత్తం పూర్తిగా మార్చేయడం జరిగింది.. ఈయన చేసే సినిమాలన్నీ కూడా ఎక్కువగా కాంట్రవర్సీగానే ఉన్నాయి.. ఆయన చేసే చేష్టలు కూడా చాలా బోల్డ్ గా ఉండడంతో పాటు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. అలాగే ఈయన చేసేటు వంటి మాత్రం పెను వివాదానికి దారి తీసే విధంగా కనిపిస్తూ ఉంటాయి.ముఖ్యంగా లేడీ యాంకర్ల విషయంలో వర్మ కాస్త చనువు తీసుకొని ప్రవర్తిస్తూ ఉంటారని చెప్పవచ్చు.
ఈ వయసులో కూడా ఈయన వెంటపడే అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు. ఈయన సోషల్ మీడియా ఖాతా తెరిస్తే చాలు అందులో అమ్మాయిలకు దిగినటువంటి కొన్ని ఫోటోలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.. వివాహం చేసుకొని జీవితానికి దూరంగా ఉన్న వర్మ కలర్ఫుల్ లైఫ్ ను మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు.ఆషు రెడ్డి, అరియనా తో బోల్డ్ ఇంటర్వ్యూలు పాల్గొని వాళ్ళని సెలబ్రిటీ చేశారు. వర్మ పుట్టినరోజు సందర్భంగా ఆయన కు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా చేశారు.కానీ వీరిద్దరూ మాత్రం అసలు బర్తడే విశేషం తెలుపలేదు దీంతో వర్మాత వీరిద్దరి మధ్య బంధం కట్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.