ఒకప్పుడు వెండితెర మధ్య బుల్లితెర మధ్య తేడా ఉండేది. కానీ ఇప్పుడు వెండితెరలో కానీ బుల్లితెరలో కానీ ఎలాంటి తేడా లేదు. బుల్లితెరపై ఇప్పుడు బడా హీరోలు హీరోయిన్ల సైతం ప్రేక్షకులను అలరిస్తున్నారు. చెప్పాలంటే హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా యాంకర్స్ గ్లామర్ తో అందంతో ఆకట్టుకుంటున్నారు. యాంకర్ల పారతోషకం విషయానికి వస్తే హీరోయిన్ల కంటే విరే ఎక్కువగా సంపాదిస్తున్నారని చెప్పవచ్చు. హీరోయిన్స్ కి ఒక్క సినిమాలోనే అవకాశం ఉంటుంది. కానీ యాంకర్స్ కి అలా కాదు ఆడియో ఫంక్షన్లు ,ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు అంటూ రకరకాలుగా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. టాలీవుడ్ లో ఎవరెవరు ఎంత తీసుకుంటారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
ఇందులో మొట్టమొదటి యాంకర్ రెండు దశాబ్దాలుగా స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తున్న యాంకర్ సుమ కనకాల ఈమె యాంకర్ గానే కాకుండా అడపాదడపా సినిమాల్లో కూడా నటిస్తోంది. ఈమె పలుషోలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా సినిమా ఆడియో ఫంక్షన్ కు హోస్టుగా ఉంటూ భారీగానే సంపాదిస్తోంది.. సుమ పారతోషకం విషయానికొస్తే దాదాపు రూ.5లక్షల రూపాయలు అందుకుంటోందట . సుమ తర్వాత అనసూయ ఈమె యాంకర్ గానే కాకుండా సినిమాల్లో కూడా అవకాశాలను అందుకుంది. అలాగే పలు షోలలో యాంకర్ గా వ్యవహరించటానికి ఈవెంట్ కి రూ.3.5 లక్షల పారతోషకం తీసుకుంటూందని సమాచారం .
అనసూయ తరువాత “రష్మి గౌతమ్”రష్మీ గత 10 సంవత్సరాలుగా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యిందిఈమె ఒక్కో ఎపిసోడ్కి రూ.2.5 లక్షల వరకు పారతోషకం తీసుకుంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రష్మీ తరువాత చివరగా బుల్లితెర “శ్రీముఖి”ఈమే ఒక్కో ఈవెంట్ కి సుమారు రూ. 2 లక్షల వరకు పారతోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక మిగతా వారంతా లక్ష పైన రెండు లక్షల లోపు తీసుకుంటున్నట్లు సమాచారం. హీరోయిన్లతో పోలిస్తే వీరు దాదాపుగా నెలకి కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తారు.