హ.. హ.. హాసిని గా బొమ్మరిల్లు సినిమా తో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది ఈ ముద్దుగుమ్మ..అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఇక బొమ్మరిల్లు, ఢీ, రెడీ వంటి సినిమాలతో భారీ విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మకు మంచి పేరు వచ్చిందనే చెప్పాలి. చూడ చక్కనైన మోము.. చక్కని కళ్ళు.. చురుకైన చూపులు.. చలాకీతనంతో ప్రేక్షకుల మనసును దోచేసిన జెనీలియా సినీ ఇండస్ట్రీకి దూరమైనా అభిమానులు మాత్రం ఈమెను మరిచిపోలేదు.
రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమైన జెనీలియా.. ఇంటిపట్టునే ఉంటూ పిల్లల బాధ్యతలు చేపట్టింది. ఈ మధ్యనే ఈ దంపతులు ఫుడ్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేశారు. ఒకవైపు బిజినెస్ చూసుకుంటూనే , మరొక వైపు నటనపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఇక మొన్నటివరకు హిందీ , మరాఠీ భాషలో అతిథి పాత్రలో మెరిసిన జెనీలియా.. ఇప్పుడు ఏకంగా తన మాతృ భాష మరాఠీ సినిమాలో పూర్తి రోల్ చేయడానికి సిద్ధమైంది. మరాఠి లో వేద్ అనే ఒక సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.
అంతే కాదు మొదటి సారి ఆమె భర్త రితేష్ దేశ్ ముఖ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక జెనీలియా సొంత బ్యానర్లోనే ఈ సినిమాను నిర్మిస్తూ ఉండడం గమనార్హం. వచ్చే ఏడాది ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం.