టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నందమూరి తారకరామారావు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలో ఎన్నో విజయాలను అందుకున్నటువంటి తారక రామారావు అనంతరం రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు అక్కడ తెలుగుదేశం పార్టీని స్థాపించి అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.
ఎన్టీఆర్ కుమారులలో హరికృష్ణకు ఎంతో మంచి ప్రాధాన్యత ఉంది.ఈయన ఎన్టీఆర్ కి కుడిభుజంలా ఉండేవారు. అంతేకాకుండా నందమూరి తారకరామారావు ఎక్కడికన్నా వెళ్లాలన్నా రథసారధిగా కూడా మారారు..ఇలా ప్రతి విషయంలోనూ ఎన్టీఆర్ కి హరికృష్ణ చేదోడు వాదోడులా ఉండేవాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నట్టుంది అనుబంధాన్ని తెంచేశాడు ఓ స్టార్ హీరో ఇంతకు ఆ స్టార్ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం
నందమూరి తారక రామారావు కుడిభుజం లా ఉండే హరికృష్ణకు తన రాజకీయ విషయాలు కానీ సినిమా విషయాలు కానీ తెలియజేసేవారట.తన కోసం తన తండ్రిని ఒక స్టూడియో కట్టించమని అడిగాడట. స్టూడియో ఉంటే భవిష్యత్తులో చాలా బాగుంటుందని హరికృష్ణ తన తండ్రి దగ్గరకు వెళ్లి నాకోసం ఒక స్టూడియో నిర్మించి ఇవ్వాలని చెప్పాడట. అప్పుడు ఎన్టీఆర్ సరే అని అన్నారట..అయితే ఎన్టీఆర్ .. అక్కినేని నాగేశ్వరరావు వద్దకు వెళ్లి హరికృష్ణ ఇలా స్టూడియో కట్టించామన్నారు అనే సంగతి చెప్పాడట.
అప్పుడు నాగేశ్వరరావు స్టూడియో కన్నా థియేటర్ నిర్మించడం మంచిదని మనకు చాలా బాగా ఉపయోగపడుతుందని తన అభిప్రాయాన్ని ఎన్టీఆర్ కి చెప్పారట. దీంతో ఎన్టీఆర్ కూడా థియేటర్ మంచిదని భావించి స్టూడియో కాకుండా థియేటర్ నిర్మాణం చేపట్టారు. అయితే హరికృష్ణ నేను చెప్పిన విధంగా కాకుండా మా నాన్నకు నచ్చినట్టు వ్యవహరిస్తున్నారన్న కోపంతో దాదాపు రెండు సంవత్సరాలు ఎన్టీఆర్ తో మాట్లాడలేదట. ఈ విషయం ఇప్పటికీ ఇండస్ట్రీలో అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటుంది.