రేణు దేశాయ్ ఇంట్లో పార్టీ.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

బద్రి సినిమాతో రేణు దేశాయ్ మొదటిసారి తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అవడమే కాకుండా పవన్ కళ్యాణ్ తో కలిసి నటించింది. రెండు మూడు సినిమాలలో జంటగా కలిసి నటించిన వీరు డేటింగ్ చేసి మరీ వివాహం చేసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ దానధర్మాలు ఎక్కువగా చేస్తున్నారనే విషయాన్ని సహించలేక రేణుదేశాయ్ భవిష్యత్తు గురించి ఆలోచించమని ప్రతిసారి హెచ్చరిస్తూ ఉండేదట. కానీ ప్రతిసారి మాట వినకపోవడంతో విసుగు చెందిన రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకుంది.

వారికి అప్పటికే ఇద్దరు పిల్లలు జన్మించడం గమనార్హం. ఇక ఇద్దరు పిల్లలను తన తీసుకెళ్లి పూణే లో స్థిరపడ్డారు. అయితే ఇటీవల ఆమె హైదరాబాద్ లో ఒక ఇల్లు కొనుగోలు చేసి ఇక్కడే ఉంటున్నట్లు సమాచారం. ఇకపోతే తాజాగా రేణు దేశాయ్ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరగబోతుంది అట . ఇక ఆ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ ను ఆమె ఆహ్వానించినట్లు సమాచారం . దీంతో పవన్ కళ్యాణ్ కూడా వస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. పిల్లలు ఎదుగుతున్నారు కాబట్టి వారి భవిష్యత్తుకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు పవన్ కళ్యాణ్ దగ్గరుండి చూసుకుంటున్నారు అని, ఈ క్రమంలోనే రేణుదేశాయ్ తో కూడా బాగా కలసి పోతున్నారు అని సమాచారం.

Share.