కొత్త అల్లుడికి ఘన స్వాగతం పలికిన రాయలసీమ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పొలిటికల్గా బాగా బలమైన భూమా ఫ్యామిలీ.. సినిమా నేపథ్యం ఉన్న మంచు ఫ్యామిలీ ఇప్పుడు వియ్యం అందుకున్నాయి. దీంతో మౌనిక వెడ్స్ మనోజ్ అనే టాపిక్ రెండు రాష్ట్రాలలో ట్రెండ్ అవుతోంది. రాయలసీమకు అల్లుడయ్యాక రాయల్ గా టూర్ వేశారు మంచు మనోజ్.. కొత్త అల్లుడికి గ్రాండ్గా వెల్కమ్ పలికింది రాయలసీమ. అసలు విషయంలోకి వెళ్తే మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్.. భూమా నాగిరెడ్డి కూతురు మౌనిక రెడ్డి మూడు ముళ్ళతో మార్చి 3వ తేదీన ఒకటయ్యారు . మెహందీ ఫంక్షన్ లో మనోజ్ అండ్ మౌనిక జంట తో పాటు అతిధులు చేసిన సందడి చాలా స్పెషల్ గా నిలిచింది. పెళ్లి తర్వాత రాయలసీమకి స్పెషల్గా టూరేసిన నవ దంపతులు భారీ కాన్వాయ్ తో పోలీసు సెక్యూరిటీతో హైదరాబాదు నుంచి రాయలసీమకు బయలుదేరారు.

భార్యతో కలిసి కర్నూలు వెళ్లిన మనోజ్ కు వేలాదిగా అభిమానులు స్వాగతం పలికారు. మౌనిక తాత ఎస్వి సుబ్బారెడ్డి ఆశీర్వాదం తీసుకొని.. మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన విందులో కొత్త దంపతులు పాల్గొన్నారు. అంతేకాదు వీరి వెంట తెలంగాణ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఉన్నారు. తమ వెంట నిలిచిన బంధుమిత్రులకు , అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ ఎమోషనల్ అయ్యారు మంచు మనోజ్. తర్వాత ప్రొద్దుటూరులో రామసుబ్బారెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నాక ఆళ్లగడ్డకు చేరుకున్న నవ దంపతులకు ఫ్లెక్సీలతో స్వాగతం పలికారు అక్కడి అభిమానులు.

ఆ తర్వాత శోభ నాగిరెడ్డి , భూమా నాగిరెడ్డి దంపతుల సమాధిని సందర్శించి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. భూమా అఖిలప్రియ కూడా వీళ్ళ వెంటే ఉన్నారు. మొత్తానికి అయితే రాయలసీమ అల్లుడికి మన రాయలసీమ గౌరవ మర్యాదలు ఏంటో చూపించారు అభిమానులు.

Share.