మాస్ రాజా రవితేజ ప్రస్తుతం కెరీర్‌లోనే తొలిసారి ట్రిపుల్ రోల్‌లో నటిస్తున్న అమర్ అక్బర్ ఆంటోని చిత్రం షూటింగ్ యమస్పీడుగా సాగుతోంది. వరుస డిజాస్టర్లతో ట్రాక్ తప్పిన దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమాతో కమ్‌బ్యాక్ అవుతాడని ఆశిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో రవితేజ పాత్ర ఎలా ఉంటుందా అని ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ కావడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు జనాలు.
ఇక ఈ సినిమా తరువాత రవితేజ విభిన్న చిత్రాల దర్శకుడు విఐ ఆనంద్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి ఫేం సంపాదించుకున్న ఈ డైరెక్టర్ రవితేజకు ఒక కథ చెప్పగా అది బాగా నచ్చిన రవితేజ వెంటనే సినిమా చేసేందుకు పచ్చ జెండా ఊపేశాడు. అయితే ఈ సినిమాలో రవితేజ డ్యుయెల్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా థ్రిల్లర్ ఎంట్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాపై అప్పుడే ఇండస్ట్రీ వర్గాల్లో బజ్ ఏర్పడింది.
నేల టిక్కెట్టు నిర్మాత రామ్ తాళ్ళురి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.