రవితేజ సినిమాలో బోల్డ్ బ్యూటీ స్పెషల్ సాంగ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మాస్ మహారాజా రవితేజ, నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో రాబోతున్న కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం రాబోతోంది. ఇక అందులో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సాంగులో అనసూయ నటిస్తోందని గతంలో వార్తలు వినిపించాయి. కానీ ఆ సాంగ్ లో ఇప్పుడు తాజాగా పాయల్ రాజ్ పుత్ నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్త పై ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు చిత్ర యూనిట్ సభ్యులు.

Payal Rajput shares a selfie with Ravi Teja from the sets of 'Disco Raja' | Telugu Movie News - Times of India
ఇక ఇదివరకే పాయల్ రాజ్ పుత్ రవితేజతో కలిసి ఒక సినిమాలో నటించింది. మరి ఈ సినిమాలో కూడా ఐటెం సాంగ్ లో నటిస్తుందేమో చూడాలి. ఇక ఈ సినిమాలో రవితేజ కామెడీ ఓ రేంజ్లో ఉంటుందని వార్త వినిపిస్తోంది. ముఖ్యంగా రవితేజ పాత్ర చాలా కొత్తగా ఉంటుందట. కిక్ సినిమాలోని రవితేజ మళ్లీ ఈ సినిమాలో కనిపిస్తాడు అన్నట్లుగా సమాచారం. ఇక ఎప్పుడు స్టార్ట్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలవల్ల పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఇక గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో చేసిన క్రాక్ సినిమాతో రవితేజ తన స్టార్ డమ్ మళ్లీ నిలబెట్టుకున్నాడు అని చెప్పవచ్చు.

Share.