రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ రివ్యూ & రేటింగ్

Google+ Pinterest LinkedIn Tumblr +

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా శ్రీను వైట్ల డైరక్షన్ లో వచ్చిన సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. రవితేజ మూడు పాత్రల్లో నటించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

అమర్ (రవితేజ), ఐశ్వర్య (ఇలియానా) ఇద్దరి పేరెంట్స్ యూఎస్ లో ఓ కంపెనీ స్టార్ట్ చేస్తారు. అయితే ఆ కంపెనీలోకి మరో నలుగురిని పార్ట్ నర్స్ గా చేర్చుకుంటారు. అయితే పార్ట్ నర్స్ గా చేరిన వారు విలన్స్ గా మారి అమర్, ఐశ్వర్య కుటుంబాన్ని నాశనం చేస్తారు. ఆ కసితో వారి మీద పగ తీర్చుకోవాలనుకున్న అమర్ ఏం చేశాడు. అమర్, అక్బర్, ఆంటోనీ ఒక్కడేనా లేక ముగ్గురా.. అమర్, ఐశ్వర్యలు ఎలా కలిశారు. ఫైనల్ గా వారి రివెంజ్ ఎలా తీర్చుకున్నారు అన్నది సినిమా కథ.

నటీనటుల ప్ర్తిభ :

అమర్, అక్బర్, ఆంటోనీ మూడు పాత్రల్లో రవితేజ తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. తన మార్క్ కామెడీ, పంచ్ లతో అలరిస్తూనే యాక్షన్ సీన్స్ లో అదర్గొట్టాడు రవితేజ. ఇక హీరోయిన్ ఇలియానా రీ ఎంట్రీ అదిరింది. కాస్త లావెక్కినా అమ్మడు గ్లామర్ షో బాగానే చేసింది. ఈ సినిమాలో ఇలియానా సొంత డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇక సునిల్, సత్య కామెడీ పర్వాలేదు. విక్రంజిత్, తరుణ్ అరోరా, ఆదిత్యా మీనన్ విలనిజం ఇంప్రెస్ చేసింది.

సాంకేతికవర్గం పనితీరు :

తమన్ మ్యూజిక్ పాటలు అంతగా ఆకట్టుకోలేదు కాని బిజిఎం ఓకే అనిపిస్తుంది. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో కెమెరా వర్క్ ఇంప్రెస్ చేస్తుంది. యూఎస్ లో యాక్షన్ సీన్స్ బాగా షూట్ చేశారు. ఎం.ఆర్ వర్మ ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. కథ, కథనాల్లో శ్రీను వైట్ల తన రొటీన్ ఫార్ములాని వదిలి కొత్తగా ట్రై చేశాడని చెప్పొచ్చు. అయితే కథ రొటీన్ రివెంజ్ డ్రామాగా అనిపిస్తుంది. కాని తన దర్శకత్వ ప్రతిభ మెప్పిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అదరగొట్టాయి.

విశ్లేషణ :

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శ్రీను వైట్ల రవితేజతో చేసిన సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ. నీకోసం, వెంకీ, దుబాయ్ శీను లాంటి సినిమాల తర్వాత ఈ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్ ను అలరించిందని చెప్పొచ్చు. సినిమా కథ, కథనాల్లో దర్శకుడు శ్రీను వైట్ల కాస్త కొత్తగా ట్రై చేశాడు.

శ్రీను వైట్ల సినిమా అంటే హ్యూమర్ టచ్ ఉండాల్సిందే. అయితే ఈ సినిమాలో తన రెగ్యులర్ సినిమాల్లానే కామెడీ ట్రాక్ ఒకటి రాసుకోగా అది సినిమాకు హెల్ప్ అయ్యిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఓ ఆంధ్రా తెలంగాణా అసోషియేషన్ వాటా అంటూ అమెరికాలో తెలుగు అసోషియేషన్స్ మీద బాగానే పంచులు వేశాడు శ్రీను వైట్ల.

అంచనాలకు తగినట్టుగానే ఈ ట్రిపుల్ ఏ రవితేజ ఫ్యాన్స్ కు మెప్పించే సినిమాగా వచ్చిందని చెప్పొచ్చు. మొదటి భాగం ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఇంటర్వల్ బ్యాంగ్ బాగుంది. సెకండ్ హాఫ్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. ఓవరాల్ గా శ్రీను వైట్ల అమర్ అక్బర్ ఆంటోనీతో మళ్లీ ఫాం లోకి వచ్చినట్టే.

ప్లస్ పాయింట్స్ :

రవితేజ

సినిమాటోగ్రఫీ

బిజిఎం

మైనస్ పాయింట్స్ :

రొటీన్ రివెంజ్ డ్రామా

స్క్రీన్ ప్లే

బాటం లైన్ :

అమర్ అక్బర్ ఆంటోనీ.. శ్రీను వైట్ల గెలిచాడు..!

రేటింగ్ : 2.75/5

Share.