జోష్ లో ఉన్న ‘డిస్కో రాజా’

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ పరిశ్రమకు రెండేళ్లు దూరంగా ఉండి..అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మాస్ మహరాజా రవితేజ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దాంతో తన తదుపరి సినిమాలు ఓ రేంజ్ లో ఉండబోతాయని ఫ్యాన్స్ అనుకున్న సమయంలో వరుసగా అట్టర్ ఫ్లాప్ సినిమాల్లో నటించాడు. దాంతో కెరీర్ ఇరకాటంలో పడింది.

ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమాపై బాగానే ఫోకస్ చేశాడు. ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా..మ్యూజిక్, కంటెంట్ విషయంలో తనకు ప్లస్ అనే విధంగా చూసుకుంటున్నాడు. ఆ మధ్య నత్తనడక నడిచిన షూటింగ్ తిరిగి ఊపందుకుంది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్ – నభా నటేశ్ నటిస్తున్నారు.

మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని ఇప్పుడు రెండో షెడ్యూల్ చక చకా కంప్లీట్ చేయాలనే ప్లాన్ లొ ఉన్నారట చిత్ర యూనిట్. నేడూ..రేపు వికారాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుందట. ఈ ఎపిసోడ్ లో కొన్ని కీలకమైన ఆసక్తికరమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. రామ్ తాళ్లూరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Share.