టాలీవుడ్ లో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చినటువంటి నటులలో రవితేజ కూడా ఒకరు. ఇప్పటివరకు హీరోగా కొనసాగిస్తూ ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా అందుకున్నారు. ఇక టాలీవుడ్ లోకి కూడా సీనియర్ హీరోల నుంచి సీనియర్ టెక్నీషియన్ ల వరకు చాలామంది వారసులు ఇప్పుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఏదో రకంగా పరిచయం అవుతూనే ఉన్నారు. కేవలం చిరంజీవి కుటుంబం నుంచి పదుల సంఖ్యలో హీరోలు ఉండగా నందమూరి కుటుంబం నుంచి ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఇక దగ్గుబాటి కుటుంబం నుంచి ఇద్దరు హీరోలు ఉండగా అక్కినేని కుటుంబం నుంచి ఐదు మంది హీరోలు ఉన్నారు.
తాజాగా రవితేజ కూడా తన వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ కొడుకు మహాధన్ త్వరలోనే ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్నాడట. 20 ఏళ్ల క్రితమే 2002లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇడియట్ సినిమాని అప్పట్లో సెన్సేషనల్ హిట్టుగా నిలిచింది. ఇప్పుడు అదే సినిమా సీక్వెల్ గా ఇడియట్-2 తో మహాధన్ ఎంట్రీ ఇవ్వాలని రవితేజ అనుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ అది మాత్రం జరగలేదు. తాజాగా వాల్తేర్ వీరయ్య సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న రవితేజ ఈ వార్తలలో ఎంత నిజం ఉంది అని అడగగా.. తన కొడుకు ఎంట్రీ ఇది వినడానికి చాలా కొత్తగా ఉందని రవితేజ తెలియజేశారు. మైత్రి మూవీ మేకర్స్ వారు మహాధన్ ఇంకా చాలా చిన్నవాడు కదా అన్నారని తెలిపారు.ఇక ఇప్పటికే రాజా ది గ్రేట్ సినిమాలో చిన్నప్పటి పాత్రలో కనిపించారని తెలియజేశారు.దీంతో రవితేజ కొడుకు ఎంట్రీ ఇప్పట్లో లేనట్లుగా తెలుస్తోంది.