ఎయిర్ పోర్ట్ లో రవీనా కి వింత అనుభూతి

Google+ Pinterest LinkedIn Tumblr +

అలనాటి అందాల నటి రవీనా టాండన్ ఈ రోజు ఉదయం తన హాలిడే తర్వాత స్వదేశం చేరుకున్నారు. అయితే ఎయిర్ పోర్ట్ కి చేరుకోగానే తనకి ఫోటో గ్రాఫేర్స్ నుండి ఊహించని సంఘటన ఒకటి ఎదురైంది. రవీనా టాండన్ ఎయిర్ పోర్ట్ లో దిగి తన కారు వద్దకి వెళుతుండగా అక్కడున్న ఫోటోగ్రాఫర్స్ తన సినిమాలోని పాటని ప్లే చేసి తనకి వెల్కమ్ చెప్పారు. ఇది తెలియని రవీనా అలా తన పాటతో తనని గౌరవంగా రిసీవ్ చేసుకున్నందుకు అందరికి థ్యాంక్స్ అని తెలిపారు.

ఇదే విషయం పై తన అఫీషియల్ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా వీడియో పోస్ట్ చేసి ” చుడండి నాకు ఫోటోగ్రాఫర్స్ నా పాట ప్లే చేసి ఎలా స్వాగతం పలికారో ” అని కామెంట్ పెట్టారు నటి రవీనా టాండన్. గతంలో రవీనా టాండన్ తెలుగులో బాల కృష్ణ సరసన బంగారు బుల్లోడు, నాగార్జున సరసన ఆకాశ వీధిలో సినిమాల్లో నటించారు. అటు తర్వాత పూర్తిగా బాలీవుడ్ సినిమాలకే పరిమితం అయ్యరు.

Share.