బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్ గా పేరు పొందింది యాంకర్ రష్మీ గౌతమ్.. వెండితెర పైన పలు అవకాశాలను కూడా అందుకుంది. అయితే తాజాగా బిగ్ బాస్ షో నిర్వాహకులకు పెద్ద షాక్ ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ టీమ్ ఎప్పుడు సీజన్ మొదలవుతుందని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈసారి జబర్దస్త్ లో ఉండే వారికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలని బిగ్ బాస్ టీం చూస్తున్నట్లు తెలుస్తోంది. కలవారు ఇచ్చిన ఫ్యాన్సీ ఆఫర్కు కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే ఎక్స్ట్రా జబర్దస్త్ ద్వారా పేరు పొందిన యాంకర్ రష్మి బంపర్ ఆఫర్ కొట్టేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఇది వరకు ఎవరికి ఇవ్వని విధంగా వారానికి రూ .3లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తూ కొంతమంది కన్సిస్టెంట్లను తీసుకున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇప్పుడు రష్మీ జబర్దస్త్ ను వదిలి రావాలి అంటే బిగ్ బాస్ షో వాళ్ళు వారానికి కచ్చితంగా రూ.7 లక్షల రూపాయలు ఇస్తే వస్తానని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే దాదాపుగా 15 వారాలకు కోటి రూపాయలు దాకా రెమ్యూనరేషన్ అందుకోబోతుందని సమాచారం.
ఒకవేళ టైటిల్ విన్నర్ అయితే మొత్తం కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇవన్నీ లెక్కలు వేసుకొని రష్మీ చెప్పిన రేటుతో బిగ్ బాస్ నిర్వాహకులు షాక్ అవుతున్నట్లు తెలుస్తోంది.మరి ఇద్దరి మధ్యలో మరో డీల్ కుదురుతుందా లేదా అన్న విషయం తెలియాలి అంటే మరొక కొద్ది రోజులు ఆగాల్సిందే. బిగ్ బాస్ -7 జులై నుంచి మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి