స్టార్ హీరో తో నటించనున్నరష్మిక

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ మహేష్ మహర్షి సినిమా సూపర్ హిట్ అవగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనీల్ రావిపుడి సినిమా మొదలు పెడుతున్నాడు. జూలై 1 నుండి సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ జరుగనుందట. సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. సినిమాలో ఓ క్రేజీ రోల్ లో విజయశాంతి నటిస్తుందని టాక్. కొన్నాళ్లుగా సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉంటున్న విజయశాంతి మళ్లీ ముఖానికి రంగేసుకుంటుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ రష్మిక మందన్న నటిస్తుంది. ఛలో, గీతా గోవిందం సినిమాలు సూపర్ హిట్ కొట్టడంతో అమ్మడికి యూత్ లో బాగా ఫాలోయింగ్ పెరిగింది. మహేష్ లాంటి సూపర్ స్టార్ తో రష్మిక నటించడం ఇదే మొదటిసారి. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఓ ట్రైన్ ఎపిసోడ్ అద్భుతంగా రాసుకున్నాడట అనీల్ రావిపుడి. ఈ ట్రైన్ జర్నీలో కామెడీ ట్రాక్ తో పాటుగా మహేష్, రష్మికల లవ్ ట్రాక్ కూడా అదిరిపోద్దట.

ట్రైన్ లోనే రష్మికను చూసి ప్రేమలో పడతాడట మహేష్. వింటేనే ఇలా థ్రిల్ అనిపిస్తుంటే ఇక వెండితెర మీద ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుస విజయాలు అందుకున్న అనీల్ రావిపుడి మహేష్ మూవీతో కూడా హిట్ కొట్టి విజయాలను సాధించడంలో సరిలేరు నీకెవ్వరు అనిపిస్తాడేమో చూడాలి.

Share.