రష్మిక మందన్న , విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి. అందుకు తగ్గట్టుగా వారి ప్రవర్తన కూడా అనుమానం కలిగించింది. కానీ ఇటీవల వీరిద్దరూ విడిపోయారు అంటూ ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. అంతేకాదు రష్మిక , విజయ్ దేవరకొండ మోసం చేసి మరో హీరోతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతోంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే నేషనల్ క్రష్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలసి గీతగోవిందం చిత్రంలో మొదటిసారి నటించారు.
ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య జోడి కుదిరిందని.. ప్రేమలో పడ్డారని.. డేటింగ్ కూడా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా కలిసి నటించారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అంతేకాదు దీనికి తోడు వీరిద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్లడం, విజయ్ ఇంటికి రష్మిక తరచూ రావడం అన్నీ కూడా వార్తలకు పునాది అయ్యాయి. కానీ ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు వీరిద్దరూ విడిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
విజయ్ దేవరకొండను కాదని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి ఇటీవల ఒక ఈవెంట్లో పాల్గొని.. చాలా క్లోజ్ గా ఫోటోలకు ఫోజులిస్తూ.. అందరి అనుమానాలకు తెర లేపారు.. అంతేకాదు వీరిద్దరూ కలిసి ఎయిర్పోర్ట్లో కూడా సందడి చేశారు. కలిసి వెళుతున్న ఫోటోలు ఇంటర్నెట్లో చెక్కర్లు కొడుతున్నాయి. వాస్తవానికి వీరిద్దరూ కలిసి సినిమా చేయలేదు.. అలా వీరిద్దరూ కలసిన సందర్భం కూడా చాలా అరుదు..కానీ మొదటిసారి ఇలా మీడియాకి చిక్కడంతో ఈ రూమర్స్ కాస్త స్ప్రెడ్ అయ్యాయి. ఏది ఏమైనా ఈ విషయం ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారింది.ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీలో ఎంట్రీ ఇస్తూ చత్రపతి సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా మే 12న విడుదల కానుంది.. మరొకపక్క రష్మిక కూడా హిందీలో యానిమల్ చిత్రంలో నటిస్తోంది.