టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న తాజా చిత్రం పుష్ప. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కబోతుండటంతో ఈ సినిమా పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 17న ఈ చిత్రం థియేటర్ లలో గ్రాండ్ గా విడుదల కానుంది. దీనితో మూవీ టీమ్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా ఫుల్ బిజీ బిజీగా ఉంది.ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సామీ సామీ అనే సాంగ్ కు చాలా కస్ట పడ్డాను అని తెలిపింది. సినిమా చూసిన తర్వాత అందులో నా యాక్టింగ్ చూసి నన్ను ప్రశంసిస్తే చాలు. డైరెక్టర్ ఏమి చెబితే అది చేస్తాను అంటూ మాట్లాడిన వీడియోను రష్మిక తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ వీడియో పై స్పందించిన ఒక నెటిజన్ అసలు దీన్ని హీరోయిన్ గా తీసుకోకుండా ఉండాల్సింది.. ఇది దీని ఓవరాక్షన్ అంటూ కామెంట్ చేశాడు.. ఈ విషయంపై స్పందించిన రష్మిక.. యాక్టింగొ, ఓవర్ యాక్టింగో.. నేను జీవితంలో ఏదో ఒకటి సాధించాను.. నువ్వు ఏం సాధించావు నాన్నా.. అంటూ నెటిజెన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మిక. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది.