వారసుడు సినిమాలో నేను ఎక్కువగా కనిపించలేదు అంటున్న రష్మిక..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ మధ్యకాలంలో విడుదలవుతున్న చిత్రాలలో హీరోయిన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉండడం లేదని చెప్పవచ్చు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే హీరోయిన్స్ కేవలం రెండు మూడు సన్నివేశాలకు పాటలకు మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు. బడా హీరోల సినిమా అంటే ఎక్కువగా హీరోని చూస్తారు ప్రేక్షకులు దీంతో డైరెక్టర్లు ,నిర్మాతలు సైతం హీరోని దృష్టిలో పెట్టుకొని సినిమా తెరకెక్కిస్తూ ఉన్నారు. హీరోయిన్ ఉందంటే ఉంది అన్నట్లుగా స్టోరీని రాసుకుంటూ వెళ్తున్నారు కొంతమంది దర్శకులు.

వారసుడు (తమిళ వెర్షన్) రివ్యూ ఇదే.. సినిమాకు మైనస్ పాయింట్లు ఏంటంటే |  thalapathy vijay rashmika varasudu movie tamil version varisu review  details, varasudu movie, thalapathy vijay, rashmika ...

ఇదే పరిస్థితి ఇటీవల ఒక సినిమాలో జరిగిందని కొంతమంది హీరోయిన్లు తెలియజేశారు. దీంతో అభిమానులు కూడా మా హీరోయిన్ ని ఎక్కువ సేపు చూపించలేదని ఫీల్ అవుతున్నట్లు సమాచారం. ఇప్పుడు తాజాగా అలాంటి పరిస్థితి రష్మిక కి ఎదురైందని చెప్పవచ్చు. ఇటీవల విజయ్ దళపతి నటించిన వారసుడు సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో విడుదల అయింది. తమిళ్లో హిట్ టాక్ వచ్చిన తెలుగులో మిక్స్డ్ టాక్ ను మాత్రం సొంతం చేసుకుంది.

Varasudu' Movie Shoot Stills Viral
అయితే కలెక్షన్ల పరంగా బాగానే రాబడుతున్న ఈ సినిమాలో రష్మిక పాత్ర చాలా తక్కువగా ఉందని సమాచారం. కేవలం రెండు మూడు సన్నివేశాలకే పరిమితం చేశారని అలాగే రెండు పాటలు కనిపిస్తుంది తప్ప మరెక్కడా కనిపించదు.. దీంతో రష్మిక స్పందించి.. దళపతి విజయ్ అంటే తనకు చాలా ఇష్టమని సినిమాలో నటించడమే అదృష్టంగా భావించాను అందుకే వారసుడు సినిమాలో నేను చేసింది ఏమీ లేదు అది నాకు కూడా తెలుసు కానీ విజయ సార్ తో కలిసి నటించా అనే పేరు కోసమే నటించాలని తెలుపుతోంది రష్మీక.

Share.