ప్రిన్స్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా రష్మిక చేసిన ఒక పని మహేష్ అభిమానులకు కోపం తెప్పించింది. కారణం సరిలేరు నీకెవ్వరు పోస్టర్ లో టాగ్స్ ను జోడించక పోవడమే. ఇంతకీ ఏం జరిగిందంటే దసరా సందర్భంగా అభిమానులకు కానుకగా ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేశారు.
ఈ పోస్టర్ లో కొండారెడ్డి బురుజు దగ్గర మహేష్ ఇంటెన్స్ లుక్ ఇస్తూ నిలబడ్డారు. ఈ పోస్టర్ ను అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ సూపర్ స్టార్ మహేష్ గారితో ఆయుధపూజ అని మొదలు పెట్టి సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతోందని.. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ మహేష్.. రష్మిక.. విజయశాంతి.. దేవీశ్రీప్రసాద్.. రత్నవేలు.. అనిల్ సుంకర లను టాగ్ చేశారు. ఈ ట్వీట్ ను రీట్వీట్ చేసిన రష్మిక జస్ట్ హ్యపీ దసరా అంటూ రెండు ఎమోజిలను మాత్రం జోడించింది.
దీంతో ఫ్యాన్స్ కు చిర్రెత్తుకొచ్చింది. కనీసం సినిమా పేరును కూడా టాగ్ చేయడం తెలియదా? మహేష్ బాబు ట్విట్టర్ ఐడీ టాగ్ ఎక్కడ? అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అంతే కాదు.. పోస్టర్ రిలీజ్ అయిన వెంటనే ట్వీట్ చేయకుండా ఎందుకు లేట్ చేశావు? అంటూ ప్రశ్నించారు. ఇప్పుడే లేచావా నువ్వు.. మా ఖర్మ నువ్వు హీరోయిన్ అంటూ మరొకరు ఆగ్రహం ప్రదర్శించారు. ఇంకో ఫ్యాన్ నిన్ను మా అన్న పక్కన ఎలా భరించాలో అంటూ చిరాకుపడ్డాడు. మరి ఇలా చేస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా మరి.. పాపం రష్మీక..