టాలీవుడ్ లో ఏ ముహుర్తాన అడుగుపెట్టిందో ఏమో కాని రష్మిక మందన్న లక్ మాములుగా లేదు. అమ్మడు తెలుగులో చేసింది కేవలం 3 సినిమాలే కాని ఆమె క్రేజ్ మాత్రం ఓ 10 సినిమాలు చేసినంతగా వచ్చింది. ఛలో, గీతా గోవిందం రెండు సూపర్ హిట్స్ కాగా దేవదాస్ పర్వాలేదు అనిపించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ సినిమా చేస్తుంది రష్మిక.
తెలుగులో సూపర్ ఫాంలో ఉన్న అమ్మడికి కోలీవుడ్ నుండి క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన తర్వాత సినిమాలో రష్మికతో రొమాన్స్ చేస్తున్నాడట. సర్కార్ సినిమా తర్వాత విజయ్ మరోసారి అట్లీ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా నయనతార, సమంతల పేర్లు వినిపించాయి. కాని ఆ ఛాన్స్ మాత్రం రష్మికకు దక్కిందట.
టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అయిన రష్మిక కోలీవుడ్ విజయ్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. తమిళంలో మొదటి సినిమానే లక్కీ ఛాన్స్ దక్కించుకున్న రష్మిక అక్కడ ఎలాంటి సక్సెస్ రేటు అందుకుంటుందో చూడాలి.