శర్వానంద్ ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఒక సరైన హిట్ పడక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. అప్పుడెప్పుడో మహానుభావుడు సినిమాతో విజయాన్ని అందుకున్న శర్వానంద్ , ఇప్పటివరకు ఒక్క హిట్టు కూడా కొట్టలేక పోయాడు. ఆ తర్వాత పడి పడి లేచే మనసు , జాను, రణరంగం, శ్రీకారం , మహాసముద్రం ఇలా అన్నీ వరుసగా ఫ్లాపులు మిగలడం ఆయనకు ఉన్న క్రేజ్ కూడా పడిపోయింది. నిజానికి మహాసముద్రం ఎన్నో అంచనాల మధ్య విడుదలైనా.. డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. అయితే ఇప్పటికీ శర్వానంద్ తో సినిమాలు తీయాలంటే నిర్మాతలు కూడా భయపడుతున్నారు.
ప్రస్తుతం ఆడవాళ్లు మీకు జోహార్లు అనే ఫ్యామిలీ కథతో ముందుకు వస్తున్నాడు శర్వానంద్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక నటిస్తోంది. ఈమె నటించిన అన్ని సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఈ సినిమాలో కూడా రష్మికా కు ఉన్న క్రేజ్ , అదృష్టం కలిసి వస్తే కచ్చితంగా ఈ సినిమాతో శర్వానంద్ అందుకోవడం ఖాయం. రష్మిక అదృష్టంతోనైనా శర్వానంద్ విజయాన్ని సాధిస్తే ఈయన క్రేజ్ మరింత పెరిగిపోయే అవకాశం ఉంటుంది.