ఇటీవల కన్నడ సినీ పరిశ్రమలో విడుదలవుతున్న సినిమాలను కూడా తెలుగులో డబ్ చేసి విడుదల చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు.. అలా విడుదలైన చిత్రాలలో కేజిఎఫ్ ,కాంతారా ,చార్లీ తదితర చిత్రాలు కూడా ఉన్నాయి.. ఇప్పుడు మరో సినిమాని తెలుగులో రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు కొన్నాళ్ల క్రితం హాస్టల్లో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రం బాయిస్ హాస్టల్ పేరుతో విడుదల చేయబోతున్నారు. కన్నడలో తెరకెక్కించినప్పుడు అక్కడ రక్షిత్ శెట్టి, దివ్యా స్పందన వంటి వాళ్లు అతిథి పాత్రలు నటించారు.
దీంతో తెలుగులో కూడా మరింత ఆసక్తి పెంచే విధంగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ను అలాగే యాంకర్ కం నటి రష్మీ గౌతమ్ ను కూడా తెలుగు వర్షన్ లో అతిథి పాత్రలో నటించే విధంగా ప్లాన్ చేశారు. ఇక ఈరోజు ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ఈవెంట్ ను సైతం రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ తో పాటు రష్మి కూడా ఈవెంట్లో పాల్గొని అక్కడ మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను తెలియజేసింది.
ఒక రిపోర్టర్ మీ లైఫ్ లో ఎవరైనా బాయ్ హాస్టల్లో ఉండే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగితే ఆమెకు అర్థం కాకపోవడంతో తాను ఎప్పుడు హాస్టల్లో ఉండలేదని కూడా తెలియజేసింది.. అలా కాదు మీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడైనా బాయ్స్ హాస్టల్లో ఉన్నారా.. అని అడిగితే మళ్లీ కాసేపు ఆలోచించి ఇప్పుడు బాయ్స్ హాస్టల్లో ఉన్న బాయ్ ఫ్రెండ్ లతో రిలేషన్ లో ఉన్నానంటే చాలా గ్యాప్ వచ్చినట్టుగా భావించాలి అంటూ తెలిపింది..
దీంతో తనకు అలాంటి బాయ్‌ఫ్రెండ్స్ ఎవరూ లేరని కూడా తెలియజేసింది. అలాగే అతిథి పాత్రలో తాను నటించడం గురించి ప్రస్తావిస్తూ ఇలాంటి పాత్రలు వచ్చిన చేస్తానని తెలియజేసింది. అప్పుడే తనకు జనాలలో గుర్తుండిపోయేలా ఉంటుందని రష్మీ. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.