సినిమాల ద్వారా కెరియర్ ప్రారంభించి మంచి గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ రష్మీ గౌతమ్. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ వంటి భాషలలో కూడా నటించింది కానీ ఏ భాషలో కూడా సరైన గుర్తింపు అందుకోలేకపోయింది. రష్మి సినిమా అవకాశాలు తగ్గుతున్న క్రమంలో జబర్దస్త్ ద్వారా యాంకర్ గా మారింది. యాంకర్ గా తెలుగు రాష్ట్రాలలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై స్టార్ యాంకర్ గా సత్తా చాటుతున్న రష్మి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారుతోంది.
అదేమిటంటే రశ్మి త్వరలోనే వివాహం చేసుకోబోతోందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 34 ఏళ్ల రష్మి ఒక ప్రముఖ బిజినెస్ మాన్ తో త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అతనిని త్వరలోనే పరిచయం చేసి పెళ్లి తేదీని కూడా ప్రకటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాక గత కొన్ని రోజులుగా సుదీర్ ప్రేమలో ఉన్నారని ప్రచారం అయితే వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు రష్మీ కానీ సుధీర్ కానీ క్లారిటీ ఇవ్వలేదు.
కానీ అభిమానులు మాత్రం వీరిద్దరూ కలిసి వివాహం చేసుకుంటే బాగుంటుందని భావిస్తూ వుంటారు. కానీ మేమిద్దరం కేవలం స్నేహితులు మాత్రమే మా ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదంటూ పలుసార్లు తెలియజేయడం జరిగింది. ఇక సుధీర్ ప్రస్తుతం హీరోగా ఎన్నో సినిమాలలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు.ఇక రష్మీ హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన సక్సెస్ కాలేకపోయింది దీంతో కేవలం బుల్లితెర పైన యాంకర్ గా సెటిల్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. మరి తన పెళ్లిపైన త్వరలోనే అప్డేట్ తెలియజేస్తుందేమో చూడాలి మరి.