కొన్ని సార్లు బరువు పెరుగుతామంటూ అభిమానికి రష్మీ గౌతమ్ కౌంటర్

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ టీవీ యాంకర్ రష్మీ గౌతమ్ అభిమాని ఒకరు ఆమె తాజాగా దిగిన ఒక ఫోటోని షేర్ చేస్తూ తన బరువు పై కామెంట్ చేసారు. సదరు అభిమాని ట్వీట్ చేస్తూ ” డియర్ రష్మీ గౌతమ్ గారు మీరు లేటెస్ట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో శారీ ధరించారు, అందులో మీరు కొంచం బొద్దుగా కనిపించరు. మీ వయసు 30 ఏళ్ళకి దగ్గర్లో ఉంది, ఇక మీరు ఒక నటిగా మీ ఫిగర్ పై శ్రద్ధ వహించాలి. ప్రముఖ హీరోయిన్స్ కాజల్, సమంత, ఈషా గుప్త 30 ఏళ్ళు పైబడిన కూడా చాల అందంగా ఉన్నారు. మీరు కూడా ఫిట్ నెస్ పై శ్రద్ధ చూపాలి. మీ అభిమానిగా మీ కెరీర్ ఈవిధంగా ముగిసి పోకూడదు అని కోరుకుంటున్న. అర్ధం చేసుకుంటారని భావిస్తున్న, నా మెసేజ్ తో మిమ్మల్ని బాధ పెట్టి ఉంటె క్షమించండి అని ట్వీట్ చేసారు.

ఈ మెసేజ్ కి బదులుగా రష్మీ గౌతమ్ ట్వీట్ చేస్తూ ” నా వయసు 30 ఏళ్లు కాదని, నేను ఎప్పుడో 30 ఏళ్లు పూర్తి చేసుకున్న. ఇక బరువు విషయానికి వస్తే కొన్ని సార్లు అలా జరుగుతూ ఉంటుంది. మేము టీవీ షోస్ లో నటించటం వలన ఇది ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. అదే సినిమాల్లో అయితే మనలోని చిన్న చిన్న లోపాలని సరిచేసుకోవడానికి కావలసిన సమయం ఉంటుంది, మన శరీర ఆకృతి పై ప్రత్యకంగా శ్రద్ధ తీసుకోవచ్చు అంటూ సదరు అభిమానికి రష్మీ గౌతమ్ రిప్లై ఇచ్చారు.

మరో ట్వీట్ లో బరువు గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని, కొన్ని సార్లు బరువు పెరుగుతాం కొన్ని సార్లు తగ్గుతాం అని చెప్పారు రష్మీ. ఒక నటిగా మా పై కొన్ని అంచనాలు ఉండటం సహజం. కానీ నాకు బరువు తగ్గటం కోసం ఫలానా డైట్ పాటించటం ఇష్టం ఉండదు అని ఆమె చెప్పారు

Share.