2022 ఏడాది ముగియడానికి కేవలం ఇక మూడు రోజులు మాత్రమే సమయం ఉన్నది.దీంతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలకడానికి కూడా చాలామంది సిద్ధంగా ఉన్నారు. దీంతో కొంతమంది సెలబ్రిటీలు సైతం ఇయర్ ఎండింగ్ ఇదే అంటూ సెలబ్రేషన్స్, పార్టీలు వంటివి చేసుకుంటూ అందుకు సంబంధించిన వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా యాంకర్ రష్మీ కూడా ఇయర్ ఎండింగ్ సెలబ్రేషన్ చేసుకుంటోంది. అయితే బుల్లితెరపై యాంకర్ గా బాగా క్రేజ్ ను సంపాదించింది ముఖ్యంగా జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది.
రష్మీ మొదట్లో పలు చిత్రాల సైడ్ క్యారెక్టర్లలో కూడా నటించింది. ఆ తర్వాత జబర్దస్త్ లో యాంకర్ గా తన కెరీర్ మొదలు పెట్టడంతో మంచి పాపులారిటీ సంపాదించింది. బుల్లితెరపై రష్మీ, సుధీర్ జోడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా పాపులారిటీతోనే ఈమె పలు చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.రష్మీ చేతిలో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, తదితర ఈవెంట్లకు యాంకర్ గా చేస్తూ ఉంటోంది.సోషల్ మీడియాలో స్టార్ గా పాపులర్ అయిన దీపిక పిల్లి కొన్ని షోలకు యాంకర్ గా కూడా చేసింది.
ఇక ఎక్కడికి వెళ్లినా సరే రష్మీ ,దీపిక పిల్లి బాగా రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా ఇద్దరూ బాగానే యాక్టివ్గానే ఉంటారని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళితే ఇన్స్టాగ్రామ్ స్టొరీ లో తాజాగా రష్మీ ఒక స్టోరీని పంచుకుంది.ఇందులో తనతో పాటు దీపిక పిల్లి ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇందులో మరొక అమ్మాయి కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరు ముగ్గురు కలిసి ఇలా మందుతో చిల్ అవుతున్నట్లుగా ఒక ఫోటోని షేర్ చేశారు. పైగా ఇందులో 2022 లో ఇదే లాస్ట్ అన్నట్లుగా క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ స్టోరీ చూశాను నటిజన్లో ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.