బుల్లితెర పై యాంకర్ గా మరోవైపు సినిమాలతో బిజీ అవుతోంది రష్మీ రష్మి గౌతమ్ ఈమె ఈ టీవీ షోలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ యాంకర్ గా చేస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక తన గ్లామర్ తో యువతలను కళ్ళు తిప్పకుండా చేస్తుంది. ఇక బుల్లితెరపై వెండితెరపై చేస్తున్న కూడా బుల్లితెర తెచ్చిన క్రేజ్ వెండితెర తీసుకురాలేదు. కేవలం జబర్దస్త్ షోలోనే కాకుండా ఢీ డాన్స్ షోలో టీం లీడర్ గా చేసింది. ఈమెకి ఇంత క్రేజ్ రావడానికి సుడిగాలి సుధీర్ కారణమని చెప్పవచ్చు.
ఈమె సుడిగాలి సుదీర్ తో క్లోజ్ గా ఉండటంతో అందరి దృష్టి ఆమె మీదే పడింది. సుధీర్ తో ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇక వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఉందని గతంలో బాగా వార్తలు వినిపించాయి. కానీ తమ మధ్య ఎటువంటి ప్రేమ లేదని కేవలం షో వరకే ఇలా మేము నటిస్తామని తెలిపారు. జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఈమె యాంకర్ గా చేసింది. ఇక సోషల్ మీడియాలో అయితే చాలా యాక్టివ్ గా ఉంటుంది రష్మీ
మొదట్లో రష్మీ చాలా పద్ధతిగా కనిపించిన రాను రాను పొట్టి బట్టలు వేస్తూ బాగా సందడి చేస్తూ ఉంటుంది. ఇక రష్మీకి మూగజీవులు అంటే చాలా ఇష్టం వాటికి ఏమైనా అయితే అస్సలు తట్టుకోలేదు. ఇదంతా కాస్త పక్కన పెడితే ఆమె ఒక వీడియోనీ పంచుకుంది. అందులో ఆమె సుదీర్ తో ఆట పట్టించిన వీడియోలు కొందరు సరదాగా ఎడిట్ చేయగా దానిని రీ పోస్ట్ చేసింది. ఆ వీడియోలు చూసిన వాళ్ళందరూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. చాలామంది ఈమెకి పెళ్లి అవసరం లేదు కేవలం డబ్బు కావాలి లైఫ్ ఎంజాయ్ చేయాలి అంటూ రష్మీ ఆంటీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
View this post on Instagram