తెలుగు బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది యాంకర్ రష్మీ. ముఖ్యంగా సుదీర్, రష్మీ జంటకు ఎంతటి క్రేజీ ఉందో ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఇక ఈమె అందచందాలకు కుర్రకారులు సైతం మంత్రం ముద్దులు అవుతూ ఉంటారు.సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే ఉంటూ నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ ఉంటుంది. రష్మి మొదట్లో వెండితెర పైన ఆర్టిస్టుగా నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ఒక వెలుగు వెలుగుతోంది.
ఇదే క్రేజీతో పలు చిత్రాలలో హీరోయిన్గా నటించిన సక్సెస్ కాలేక పోయింది. ప్రస్తుతం దృష్టి మొత్తం బుల్లితెర కెరియర్ పైన పెట్టింది. ఇక ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షో కి టీం లీడర్ గా కూడా వ్యవహరించింది..అలాగె జబర్దస్త్ ,ఎక్స్ ట్రా జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి శూలకు కూడా ఈమె యాంకర్ గా చేసింది. ఇక ఏదైనా ఈవెంట్ వచ్చిందంటే చాలు అందులో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది.ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను సైతం పంచుకుంటూ ఉంటుంది. అలాగే జంతువుల పట్ల కూడా తాను చూపించే ప్రేమ కూడా చాలా ఎమోషనల్ గా షేర్ చేస్తూ ఉంటుంది.
ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ -7 లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇందులో యాంకర్ రష్మీ కూడా కంటిస్టెంట్ గా వెళ్లబోతోంది అనే వార్తలు వినిపించాయి.దీంతో వెంటనే రష్మీ స్పందిస్తూ తను బిగ్ బాస్ లో అవకాశం అందుకున్నట్లు వచ్చిన పుకార్లు ఆపండి అంటూ తాను బిగ్ బాస్ లో ఎటువంటి భాగం కాదు అన్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక స్టోరీ కూడా వైరల్ గా మారుతోంది.