టాలీవుడ్ బ్యూటీ సమంత హాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈమె అరేంజ్మెంట్స్ ఆఫ్ అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. ఇందులో సమంతా బై సెక్సువల్ తమిళ అమ్మాయిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈసినిమాకు ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే మా కు సంబంధించి షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ చక్కర్లు కొడుతోంది.
సమంతా నటిస్తున్న ఈ సినిమాపై ప్రకటన ఇస్తూ.. ఈ మూవీ ద్వారా కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్న.. షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా అంటూ ఇటీవల తన ఇంస్టాగ్రామ్ లో పోస్టర్ ను షేర్ చేసింది సమంత. అయితే ఇంత క్రేజీ ఆఫర్స్ సమంతాకు ఎలా వచ్చింది అంటూ సినీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ రోల్ కి ఎవరు సరిపోతారని నిర్మాతలు ఆలోచిస్తుండగా సమంత అయితే ఆ పాత్రకు కరెక్టుగా సరిపోతుంది అనే టాలీవుడ్ స్టార్ హీరో అయినా రానా సలహా ఇచ్చారట.