తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ రసవత్తరంగా సాగుతోంది. తెలుగు తో పాటు అన్ని భాషలలో కూడా విజయవంతంగా కొనసాగుతోంది. తెలుగులో అలాగే తమిళంలో ప్రస్తుతం ఐదవ సీజన్ నడుస్తోంది. తెలుగులో ప్రస్తుతం ఈ షోకి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. తమిళంలో విశ్వనటుడు కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అయితే కమల్ హాసన్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
దీంతో తమిళ బిగ్ బాస్ షో కి కొత్త కోచ్ ని ఎంచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో తాత్కాలికంగా కమలహాసన్ ప్లేస్ లో శృతి హసన్ ను పూర్తిగా తీసుకొస్తారు అన్న వార్తలు వినిపించాయి. కానీ కోలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కమలహాసన్ ప్లేస్ లో సీనియర్ హీరోయిన్ లెజెండ్రి యాక్ట్రెస్ రమ్యకృష్ణ హోస్ట్ గా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం .అయితే ఇప్పటికే తెలుగులో బిగ్బాస్ షోకి రమ్యకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీంతో తమిళ బిగ్ బాస్ కి కూడా రమ్యకృష్ణ అనే తీసుకురావాలని నిర్వాహకులు భావిస్తున్నారట. అందుకు రమ్యకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరి ఇందులో నిజానిజాలు తెలియాలి అంటే చూడాల్సిందే మరి.