టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్ ఇప్పటికీ కూడా రాజమేలుతోంది ఆమె ఎవరో కాదు హీరోయిన్ రమ్యకృష్ణ.. మొదటగా సహాయ నటిగా పలు సినిమాలలో నటించి ఆ తరువాత హీరోయిన్గా పరిచయమయ్యింది. కానీ వెంటనే సక్సెస్ కాలేక పోయింది రమ్యకృష్ణ.. ఆ తర్వాత కే .రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అల్లుడుగారు సినిమాతో స్టార్ స్టేటస్ ని అందుకుంది.. అప్పటికే కాదు ఇప్పటికీ కూడా ఆమె స్టార్ నటి గా ఆమె రేంజ్ కానీ ఏ మాత్రం తగ్గలేదనే చెప్పవచ్చు..
ఈ విషయాన్ని కాస్త పక్కకు పెడితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ ఇప్పటి హీరోయిన్ల గురించి కొన్ని విషయాలను తెలిపింది.. రమ్యకృష్ణ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్న అమ్మాయిలు మాలాగా 20 నుంచి 25 ఏళ్ల వరకు కెరీర్లో కొనసాగించలేకపోతున్నారు. ఇది వాస్తవానికి నిజం దానికి చాలా కారణాలు ఉన్నాయి..ఒకప్పుడు మేము తప్పులు చేయటానికి వాటిని కరెక్ట్ చేయటానికి మాకంటూ ఒక అవకాశం ఉండేది. సినిమా సక్సెస్ అయినా కాకపోయినా మాకు మళ్ళీ అవకాశాలు వస్తూ ఉండేవి.
కానీ ఇప్పుడు అలా కాదు ఒక హీరోయిన్ సినిమా ఇప్పుడు సక్సెస్ అయితే ఆమెకు నాలుగైదు అవకాశాలు వస్తాయి. ఆ సినిమా సక్సెస్ అవుతుందో లేదో ఆ విషయం పక్కన పెడితే హీరోయిన్లు కూడా వచ్చే అవకాశాలను వదులుకోకుండా అన్ని సినిమాలకు చేస్తామంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. మేము దాదాపు కొన్నేళ్ల నుంచి కష్టపడి సంపాదిస్తున్న మొత్తాన్ని వాళ్లు కొద్ది రోజుల్లోనే సంపాదిస్తున్నారు.ఇండస్ట్రీ విషయానికి వస్తే మన టైం ఎలా ఎప్పుడు మారుతుందో ఎవ్వరు ఊహించలేరు.. ఉన్నదాంట్లోనే అడ్జస్ట్ కావటం చాలా బెటర్ లేని దానికోసం పాకులాడే కన్నా ఉన్నదాంట్లోనే తృప్తిగా ఉండటం చాలా మంచిది అంటూ రమ్యకృష్ణ చెప్పుకొచ్చింది.