రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రేక్షకులకు హీరో ఉదయ్ కిరణ్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ముఖ్యంగా ఈయన గురించి చెప్పగానే ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఉదయ్ కిరణ్ సినిమాలలో కనుక రాకుండా ఉండి ఉంటే ఎక్కడో ఒకచోట ఏదో ఒక పని చేసుకుని చాలా హ్యాపీగా ఉండేవారు. ఇక ఉదయ్ కిరణ్ నటుడు అవ్వాలని కోరిక ఉండడంతో పలు మోడలింగ్ ఏజెన్సులతో తన ఫోటోలకు ఇచ్చేవారట. అలా అహ్మద్ అనే ఒక మోడల్ కోఆర్డినేటర్ ఉదయ్ కిరణ్ ఫోటోలను దర్శకులు చూపిస్తూ ఉండేవారని తెలుస్తోంది.
ఉదయ్ కిరణ్ ని తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది మాత్రం డైరెక్టర్ తేజ నే. అలా అని ఉదయ్ లాంటి వ్యక్తి కోసం తేజ వల వేసి పట్టుకోలేదు. పైగా చిత్రం సినిమాలో ఉదయ్ కిరణ్ పాత్ర కోసం చాలామందిని ట్రై చేసిన తర్వాతే ఎలాంటి ఆప్షన్ లేకపోవడంతో ఉదయ్ కిరణ్ ఫైనల్ చేశారట తేజ. సినిమా కోసం పూజ ముహూర్తం జరగడానికి ముందు రోజు రాత్రి వరకు హీరోను మార్చేయాలని చిత్ర యూనిట్ చాలా సన్నహాలు చేసిందట.
చిత్రం సినిమా తీయాలని తేజ అనుకున్నప్పుడు నిర్మాత రామోజీరావు గారు ఇచ్చిన బడ్జెట్ కేవలం 40 లక్షలు.. అందులో నటించే హీరో కోసం కేవలం 11 వేల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. అప్పుడు ఒక కొత్త హీరో కోసం వెతకడం ప్రారంభిస్తున్న సమయంలోనే ఉదయ్ కిరణ్ ని సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. కానీ రామోజీరావుకు ఉదయ్ కిరణ్ నచ్చలేదట. ఈ సినిమా కోసం గతంలో చైల్డ్ యాక్టర్ గా నటించిన ఒక వ్యక్తిని హీరోగా పెట్టి తలకెక్కించాలని.. రూ.11 వేల రూపాయలు ఇస్తే చేయనని వెళ్లిపోయారట. ఆ తర్వాత మరొక వ్యక్తి కూడా తెచ్చిన పలు కారణాలవల్ల ఒప్పుకోలేదట. ఇక హీరోయిన్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డ చివరికి రీమాసేన్ ని ఫిక్స్ చేశారు డైరెక్టర్ తేజ.