మెగా హీరోపైనే త‌మ్ముడి భారం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పై ఇప్పుడు ఓ పెద్ద భారం ప‌డింది.. ఆ భారం అంతా ఇంతా కాదు.. మెగాస్టార్ కుటుంబం నుంచి వెండితెర‌కు త‌న త‌మ్ముడిని ప‌రిచ‌యం చేసే బాధ్య‌త అన్న మాత‌.. అంటే మెగాస్టార్ చిరంజీవికి ఒక్క‌డే కొడుకు రామ్ చ‌ర‌ణ్‌.. మ‌రి త‌మ్ముడెక్క‌డి నుంచి వ‌చ్చాడు.. ఇంత‌కు ఏ త‌మ్ముడు.. త‌మ్ముడు వ‌రుణ్‌తేజ్‌ను ఇప్పటికే సినిమాల‌కు ప‌రిచయం చేశారుగా.. వ‌రుస‌గా సినిమాలు చేస్తూ 10వ సినిమాకు కూడా వ‌రుణ్‌తేజ్ మూహూర్తం కుదుర్చుకున్నాడు..

మ‌రి ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చిన త‌మ్ముడెవ‌రు అనేది హాట్ టాపిక్‌గా మారింది.. మెగాస్టార్‌కు ఇద్ద‌రు త‌మ్ముళ్ళు.. ఒక‌రు నాగ‌బాబు, మ‌రొక‌కు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. మ‌రి రామ్ చ‌ర‌ణ్ ఏ త‌మ్ముడి బాధ్య‌త తీసుకున్నాడో అని బుర్ర గోక్కుంటున్నారా.. అదేనండీ చిన్నాన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొడుకు అకీరానంద‌న్ బాధ్య‌త రామ్ చ‌ర‌ణ్ తీసుకోనున్నాడ‌ట‌. అందుకు చిన్నాన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు రామ్‌చ‌ర‌ణ్ ప్రామిస్ కూడా చేశాడ‌ట‌.. ఏమని ప్రామిస్ చేశాడు అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

అకీరా నంద‌న్ ప్ర‌స్తుతం నూనుగు మీసాల వ‌య‌స్సులోకి వ‌చ్చారు. అయితే ప్రస్తుతం అకీరా త‌ల్లి రేణుదేశాయ్ ద‌గ్గ‌ర పెరుగుతున్నాడు. ప్ర‌స్తుతం అకీరా చ‌దువుపైనే దృష్టి సారించాడు. ఇటీవ‌ల అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు అనే చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో అది ఇంకా ఖ‌రారు కాలేదట‌.. అకీరా చ‌దువుల‌కు విదేశాల‌కు వెళుతాడా.. సినిమాల్లోకి వ‌స్తాడా అనేది తేలితే అప్పుడు సినిమాల్లోకి వ‌స్తే రామ్‌చ‌ర‌ణ్ త‌మ్ముడిని ముందుకు న‌డిపే బాధ్య‌త తీసుకుంటాన‌ని చిన్నాన్న ప‌వ‌న్‌కు మాటిచ్చాడ‌ట‌. సో అకీరా నంద‌న్ సినిమాల్లోకి వ‌స్తే ముందుగా అన్న రామ్ చ‌ర‌ణ్ సొంత బ్యాన‌ర్‌లోనే సినిమా చేస్తాడ‌న్న మాట‌..

Share.