టాలీవుడ్లో అలనాటి హీరోయిన్లలలో రంభ కూడా ఒకరు. ఇమే అందచందాలతో ఎంతోమంది కుర్రకారులను ఆకట్టుకుంది. మొదట స్వర్గం అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. తెలుగులో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ఎంట్రీ ఇచ్చి తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన కూడా నటించింది.

టాలీవుడ్ హీరో నాగార్జునతో రెండు మూడు అవకాశాలు వచ్చిన కొన్ని కారణాలవల్ల ఈమె నటించలేక పోయిందట.. ఒకపక్క సినిమాలలో నటిస్తూనే మరొక పక్క పలు చిత్రాలలో గెస్ట్ రోల్స్ తో పాటు ఐటెం సాంగ్‌లలో కూడా నటించింది.. హీరోయిన్ రంభ తొమ్మిది భాషలలో 100కు పైగా చిత్రాలను నటించింది. సినిమాలలో నటిస్తున్న సమయంలోనే చాలామంది హీరోలతో ప్రేమలో పడి బ్రేకప్ చెప్పిందని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.
అసలు విషయంలోకి వెళ్తే రంభ అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినప్పటికీ కూడా రెండవ వివాహ వ్యక్తిని ఎందుకు వివాహం చేసుకుందనే విషయంపై పలు కథనాలు మీడియాలో ఎక్కువగా వినిపించాయి.. అలా వినిపించిన సమాచారం ప్రకారం హీరోయిన్ రంభ రెండవ పెళ్లి వాడిని వివాహం చేసుకోవడానికి ముఖ్య కారణం ఆమె అప్పులేనట.. రంభ త్రీ రోజెస్ సినిమా కోసం తన బిల్డింగును తాకట్టు పెట్టి మరి సినిమాని పూర్తి చేసిందట.
కానీ ఆ సినిమా వల్ల తీవ్రమైన నష్టాలు రావడంతో చివరికి తను తాకట్టు పెట్టిన బిల్డింగును కూడా అమ్మేసి ఒక చిన్న ఇంట్లో తన ఫ్యామిలీతో కలిసి షిఫ్ట్ అయిందట. ఆ తర్వాత ఈమెకు అవకాశాలు తగ్గిపోవడంతో ఐటెం సాంగ్‌లతో పాటు బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరించింది. అలా చాలీచాలని రెమ్యూనరేషన్ వస్తున్న సమయంలో శ్రీలంకకు చెందిన కెనడా బిజినెస్ మాన్ ఇంద్ర కుమార్ పద్మనాభన్ కు రంభ అంటే చాలా ఇష్టం ఉండడంతో.. రంభ పరిస్థితిని తెలుసుకొని ఆయన అప్పులు మొత్తం తీర్చేసి ఆమెకు కారు కూడా గిఫ్ట్ ఇచ్చారట .దీంతో అతనితో ప్రేమలో పడి వివాహం చేసుకుందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.