మూవీ మొఘల్ రామానాయుడు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా ఆధిపత్యం చెలాయించిన ఈయన ఎక్కువగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి హీరోలతో సినిమాలను తెరకెక్కించే నిర్మాతగా సక్సెస్ అయ్యారు.. నిజానికి ఒకప్పుడు నిర్మాతల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది.. రామానాయుడు అంటే నిర్మాతల గురించి మీడియాలో ఎక్కువగా చర్చ జరిగేది. అగ్ర హీరోలతో ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. చిన్న సినిమాల్లో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఏమాత్రం వెనుకడుగు వేసేవారు కాదు.. యువ హీరోలను పరిచయం చేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉండేవారు..
ఇదిలా ఉండగా గతంలో ఒక ఇంటర్వ్యూలో తాను సినిమాల్లోకి రావడానికి ఎంత కష్టపడ్డారో వివరించారు రామానాయుడు గారు.. తను సినిమాల్లోకి రావడానికి గానూ 300 ఎకరాలు అమ్ముకున్నాను అని తెలిపారు. తాను మేనత్త కూతుర్ని వివాహం చేసుకున్నాను అని.. వ్యవసాయం చేస్తే అందులో ఎదురు దెబ్బలు తగిలాయని ..రైస్ మిల్ విషయంలో కూడా ఇబ్బంది పడ్డాను అని తెలిపారు. నమ్మినబంటు సినిమాలో అక్కినేని డూప్ గా నటించాను అని కూడా తెలిపారు రామానాయుడు. అలాగే హీరోయిన్ల విషయంలో కూడా తాను చాలా జాగ్రత్తగా ఉండేవాడిని అని తెలిపారు..
శోభన్ బాబుతో తనకు చాలా మంచి సంబంధాలు ఉండేవి అని, శోభన్ బాబు సంపాదించిన సొమ్ముతో ఆస్తులు కొనుక్కున్నారు అని వివరించారు..తన భార్య షూటింగ్లకు ఎప్పుడు రారని కూడా ఆయన తెలిపారు. శివాజీ గణేషన్ తో కూడా తనకు మంచి స్నేహం ఉందని ఆయన మంచి జోక్స్ వేసే వారని తెలిపారు.. ఇదిలా ఉండగా రామానాయుడు వారసుడు వెంకటేష్, మనవడు రానా తీస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు సందర్భంగా గతంలో రామానాయుడు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.