టాలీవుడ్ యువ కథానాయకుడు రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్ తొలిసారి జంటగా నటించిన చిత్రం ” హలో గురు ప్రేమకోసమే ” సినిమా టీజర్ ఈ రోజు విడుదల చేసారు చిత్ర యూనిట్ సభ్యులు. టీజర్ చూస్తుంటే ఇది ఒక రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. తెర మీద రామ్, అనుపమ జంట కూడా చూడ ముచ్చటగా ఉండటంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయ్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రామ్ ఈ టీజర్ ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ సరదాగా ‘హాట్ గా ఉంది’ అనే హాష్ టాగ్ జత చేసారు. ఇది ఈ సినిమాలో రామ్ కాఫి తాగుతూ అనుపమ ని చూస్తూ పలికే డైలాగ్.
దర్శకుడు త్రినాథ రావు నక్కిన ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలూ అందించారు. శిరీష్, లక్ష్మణ్ ఈ సినిమాకి సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.