నిధి అగర్వాల్ పై వర్మ కన్ను….సంచలన ట్వీట్

Google+ Pinterest LinkedIn Tumblr +

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన రంగీలా సినిమా ఇప్పటికి సిని ప్రపంచంలో ఓ ఇంద్రదనస్సే అని చెప్పొచ్చు. ఊర్మిళ మండోద్కర్ను ప్రధానంగా తీసుకుని రామ్గోపాల్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్బస్టర్ సినిమాగా నిలిచిపోయింది. అప్పటి ఈ సినిమాను మరోమారు తీయాలంటూ వర్మ శిష్యులు, అభిమానులు రామ్గోపాల్ వర్మను అడుగుతున్నారు… ఈ మేరకు సోషల్ మీడియాలో రంగీలా 2 సినిమాకు రంగం సిద్దం చేయాలని ఓ ప్రముఖ దర్శకుడు వర్మను కోరడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.

రంగీలా సినిమా 8 సెప్టెంబర్ 1995న విడుదల అయింది. హిందిలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఊర్మీళ మండోద్కర్తో పాటు అమీర్ ఖాన్, జాకీ షరాఫ్ నటించారు. ఈ చిత్రం ఆ రోజుల్లోనే బాలీవుడ్లో బ్లాక్బస్టర్గా నిలిచింది. అయితే రంగీలా 2 తీయాలనే ఆలోచన రామ్గోపాల్ వర్మకు ఎందుకొచ్చింది అనేది ఇక్కడ ప్రశ్న. ఇస్మార్ట్ శంకర్ సినిమా ట్రైలర్ను చూసిన రామ్గోపాల్ వర్మ టీమ్ను, దర్శకుడు పూరి జగన్నాథ్ను అభినందిస్తూ ట్విట్ చేశాడు. దీంతో రామ్గోపాల్ వర్మ ట్వీట్కు స్పందించిన పూరి షాకింగ్ ప్రతిపాదన పెట్టాడు…ట్వీట్ లో భాగంగా
రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ గా నిధి నువ్వు ఆ సూర్యుడి కంటే చాల హాట్ గా ఉన్నవని సంచలన ట్వీట్ చేయటం విశేషం.

పూరి జగన్నాథ్ ప్రతిపాదన ఎంటంటే రంగీలా 2 సినిమాను తీయాలని రామ్ గోపాల్ వర్మను కోరాడు. ఈ సినిమాలో నటించేందుకు నిధి అగర్వాల్ బాగా అక్కరకు వస్తుందనే విధంగా ప్రతిపాధించాడు. నిధి అగర్వాల్ మీకో పెద్ద ఫ్యాన్ అంటూ నిధిని రామ్ గోపాల్ వర్మకు పరిచయం చేస్తూ రంగీలా 2 రూపొందించాలని కోరాడు. దీనికి స్పందించిన వర్మ సరే కానీ, కాదు అని కాని సమాధానం చెప్పకుండా, త్వరలో ఇస్మార్ట్ శంకర్ టీంతో కలుద్దాం. రంగీలా పాటలతో ఆడిపాడుదాం అనే అర్థం వచ్చేలా రీ ట్వీట్ చేశాడు. దీనికి నిధి అగర్వాల్ కూడా స్పందిస్తూ వర్మకు బిగ్ థ్యాంక్స్ చెప్పింది. సో రంగీలా 2ను వర్మ రూపొందించేనా, ఒక వేళ తీస్తే అందులో నిధి అగర్వాల్ను తీసుకుని శిష్యుడు పూరి జగన్నాథ్ కోరిక తీర్చేనా అనే ప్రశ్నలకు వర్మ చెప్పె సమాధానం కోసం వేచి చూడాల్సిందే…

Share.