టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి తనయుడిగా అడుగుపెట్టి అగ్ర స్టార్ గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు రామ్ చరణ్ ..మొన్నటికి మొన్న RRR చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని తండ్రికి తగ్గ తనయుడుగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. ఆయన ఏ సినిమా తీయాలన్నా ఎంతగానో ఆలోచించి ఎవరిని నొప్పించకుండా నిర్ణయం తీసుకుంటాడు. అయితే రామ్ చరణ్ ఇతరులకు తొందరగా అర్థం కారు ..ఈయనని బాగా దగ్గరనుంచి చూసినవారు మాత్రమే ఈయన స్వభావం గురించి చెబుతూ ఉంటారు. ఏ విషయంలోనైనా ఆచితూచి అడుగులు వేసే చరణ్ ఒక విషయంలో మాత్రం డైరెక్టర్ ను భారీగా ఇబ్బందులు పెట్టాడట.
ఇంతకు ఆయన ఇబ్బంది పెట్టిన ఆ సంఘటన ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. రామ్ చరణ్ ,కాజల్ అగర్వాల్ నటించిన చిత్రం గోవిందుడు అందరివాడే ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది కృష్ణవంశీ..ఈ సినిమాకి రామ్ చరణ్ కమిట్ అయిన తర్వాత సినిమా షూటింగ్ చేయాలి అనుకున్న సమయంలో ఈ సినిమాలో జయసుధ పాత్ర కోసం రోజాని అనుకున్నారట. అయితే రామ్ చరణ్ కి ఈ విషయం తెలియదు.. రామ్ చరణ్ కి ఈ విషయం తెలిసేసరికి ఈ సినిమాలో రోజా నటిస్తే నేను నటించను అని కృష్ణవంశీకి డైరెక్ట్ గా చెప్పేశారట.
అంతేకాకుండా కొద్ది రోజుల పాటు రామ్ చరణ్ షూటింగ్ కూడా రాలేదని అయితే అప్పటికి ఇంకా రోజాపై ఎలాంటి సన్నివేశాలను చిత్రించలేదు.. కాబట్టి ఇప్పుడు రోజా గారిని పెట్టుకుంటే రామ్ చరణ్ ఈ సినిమా నుంచి తప్పుకుంటానని చెప్పారట.. దీంతో కృష్ణవంశీ కూడా ఆమెను తొలగించి జయసుధను పెట్టాడు. అయితే రోజా ఆ సినిమాలో నటిస్తే రామ్ చరణ్ ఎందుకు నటించానని చెప్పారు.. అనే విషయాన్ని వస్తే రోజాని నానమ్మ పాత్రలో చూడటం చరణ్ కి ఇష్టం లేకపోవడంతో ఇలా మాట్లాడాలని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.