మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం చెర్రీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆర్సీ 15 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.అయితే ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ను మహారాష్ట్రలోని పూణే, సతారా, ఫాల్టన్‌లలో జరిగింది.నవంబర్ 15 నుండి సెకండ్ షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. సెకండ్ షెడ్యూల్ ను హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో వేసిన సెట్ లో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్ లో ఒక సాంగ్ తో పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కూడా తెరకెక్కించనున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ చరణ్ ఈ సినిమా విడుదల తేదీను రివీల్ చేశారు.మెగా హీరో శంకర్‌తో కలిసి పనిచేసే ప్రతి ఒక్క క్షణాన్ని ఆస్వాదిస్తున్నానని, శంకర్ వంటి దర్శకుడితో పని చేస్తున్నప్పుడు కొన్ని అద్భుతమైన ఫ్యాన్ బాయ్ క్షణాలను ఆనందించానని తెలిపారు చరణ్. అలాగే ఆయన చెర్రీ మాట్లాడుతూ ఆర్సీ 15 అనేది పొలిటికల్ డ్రామా అని చెప్పు కొచ్చారు.ఫిబ్రవరి 2023లో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనే ఆలోచన ఉంది అని చరణ్ తెలిపారు.