మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి దర్శకత్వం లో నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బోయపాటి అన్ని సినిమాల్లో లాగానే ఏ చిత్రంలో కూడా భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయి అని సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ మరియు రామ్ చరణ్ తూర్పు ఐరోపా లోని అజర్ బైజాన్ నగరానికి వెళ్లనున్నారని సమాచారం. ఇక ఈ సినిమా రామ్ చరణ్ సినీ కెరీర్ లోనే పక్క మాస్ ఎంటర్టైనర్ గా నిలవనుందట.
సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి స్వరాలూ అందించారు, తెలుగు హీరో ఆర్యన్ రాజేష్ ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రా పోషిస్తున్నారని సమాచారం. అలనాటి నటి స్నేహ కూడా ఈ మాస్ ఎంటర్టైనర్ లో కీలక పాత్రా చేయనున్నారని తెలిసింది. అందాల భామ కియారా అద్వానీ రామ్ చరణ్ సరసన తొలిసారిగా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని నిర్మాత దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై నిర్మిస్తున్నారు.
Long long schedule ahead – #rc12 #ramcharan – guess the location ??? 😛 pic.twitter.com/mmHtFnYckK
— Upasana Kamineni (@upasanakonidela) August 30, 2018