మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ హీరోగా పరిచయం అయినప్పటి నుంచి చాలా తక్కువ సినిమాల్లో నటించారు. నటించిన సినిమాలు ఒకటీ రెండు తప్ప అన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. రాంచరణ్ కెరీర్లో మగధీర తర్వాత ఆ రేంజ్ హిట్ సినిమా గత ఏడాది సుకుమార్ దర్శకత్వంలో నటించిన ‘రంగస్థలం’సాధించింది. ఈ సినిమాలో చిట్టిబాబు గా ఓ చెవిటివాడి పాత్రలో నటించాడు రాంచరణ్. మాస్ లుక్..యాక్షన్, కామెడీ తో చెర్రీ అదరగొట్టాడు.
ఎవరు ఊహించని రేంజ్లో ఈ సినిమాలో ఒక సరికొత్త రామ్ చరణ్ ని చూపించడమే కాకుండా అద్భుతమైన కథనంతో ఈ సినిమాను తెరకెక్కించడం వలన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను సృష్టించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తాజాగా ‘రంగస్థలం’మరో రికార్డు క్రియేట్ చేసింది. శివరాత్రి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ సినిమాను కూడా స్పెషల్ షోస్ రెండు స్క్రీన్లలో వేశారు.
ఇప్పటి వరకు ఏ సినిమాకు రాని విధంగా 1లక్షా 40 వేలు రూపాయలు కలెక్ట్ చేసినట్లు సమాచారం. ప్రతి సంవత్సరం శివరాత్రి స్పెషల్ గా వేసే ఏ సినిమాకు కూడా ఇంత రాలేదట. దాంతో రాంచరణ్ ‘రంగస్థలం’ఆల్ టైం రికార్డు చేరిందని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.