విజయ్ దేవరకొండ అంతగా మారతాడని అనుకోలేదు: రామ్ చరణ్

Google+ Pinterest LinkedIn Tumblr +

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘గీత గోవిందం’ ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి షో నుండే హిట్ టాక్ తో దూసుకుపోతుంది ఈ చిత్రం. తొలిరోజే రికార్డు స్థాయిలో సుమారు 9 . 7 కోట్ల షేర్ ని వసూలు చేసింది ఈ కామెడీ ఎంటర్టైనర్. ఇక రెండో రోజు కూడా గోవిందుడి జోరు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మాత్రం తగ్గలేదు. ఇది ఇలా ఉంటె ఇండస్ట్రీ లోని ప్రముఖులు కూడా ఈ చిత్రం చూసి విజయ్ ని మరియు మొత్తం చిత్ర యూనిట్ ని అభినందిస్తున్నారు. మొన్న మెగాస్టార్, నిన్న మహేష్ బాబు కూడా ఈ చిత్రం చూసి వారి అభిప్రాయాలు తెలియచేసారు.

ఇక ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గీత గోవిందం’ సినిమా చూసి తన అఫీషియల్ పేస్ బుక్ ఎకౌంట్ ద్వారా చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. రామ్ చరణ్ మాటల్లో..

” విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి వంటి బోల్డ్ అండ్ మాస్ క్యారెక్టర్ చేసిన తరువాత ఈ సినిమాతో పూర్తిగా మారిపోయాడు, విజయ్, రష్మిక నటన ఈ చిత్రం లో చాల సహజంగా ఉంది. సినిమా కథకి వారి నటన మరింత అదనపు ఆకర్షణ తెచ్చి పెట్టింది. సంగీత దర్శకుడు గోపి సుందర్ స్వరాలు కూడా చాల ఉత్సాహంగా ఉన్నాయ్. ఇక సినిమా దర్శకుడు పరశురామ్ తాను రాసుకున్న కథని చాల అందంగా తెర పై చూపించారు. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి, మరియు ప్రతి ఒక్క టెక్నిషియన్ కి కంగ్రాట్స్” అని పోస్ట్ చేసారు రామ్ చరణ్.

Share.