టాలీవుడ్ లో స్టార్ హీరోలా మధ్య రిలేషన్స్ గత కొంత కాలం నుండి బాగా పెరిగాయి అని చెప్పవచ్చు. దీనికి చక్కటి ఉదాహరణ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు మధ్య ఉన్న బంధం. ఇటీవలే కాలంలో వీరి మధ్య బంధం బాగా బలపడింది ఇది వారి అభిమానులకి కూడా ఎంతో సంతోషాన్నిస్తుంది. ఇక తాజాగా మొన్న మహేష్ బాబు కూతురు సితార పుట్టిన రోజు నాడు చరణ్ సోషల్ మీడియా ద్వారా తనకి విషెస్ పంపగా అది కాస్త వైరల్ గా మారింది.
ఇక నిన్న జరిగిన ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ పుట్టిన రోజుకి కూడా చరణ్ ఒక వీడియో తీసి విషెస్ సెండ్ చేసారు..దీన్ని ఉపాసన తన అధికారిక ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా అభిమానులతో షేర్ చేసి అభిమానులని ఉత్సాహపరిచారు. ఉపాసన తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియో షేర్ చేస్తూ హ్యాపీ హాపీ బర్త్ డే డార్లింగ్ అభయ్ రామ్ అని పోస్ట్ చేసారు.ఈ వీడియో లో ఎన్టీఆర్ అభయ్ రామ్ ని విష్ చేస్తూ నీకు ఒక బర్త్ డే గిఫ్ట్ ని కూడా పంపానని అది మీ నాన్న దగ్గర నుండి తీసుకో అని చెప్పారు రామ్ చరణ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తుంది.