డాడీ తో అది కుదరదంటున్న చెర్రీ

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల రంగస్థలం సెట్‌లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తన తరువాత షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్ తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. పక్కా ప్లానింగ్‌తో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ కథలో కొంత మార్పు చేయాలని చూస్తున్నాడు చిత్ర నిర్మాత రామ్ చరణ్.

నిజానికి చరిత్ర చెబుతున్న ప్రకారం బ్రిటిష్ వాళ్లకి చిక్కిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని వారు ఉరికొయ్యకు వేలాడదీశారు. కానీ ఇలాంటి క్లైమాక్స్‌ను మెగా ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారా అనే సందేహం చరణ్‌లో ఏర్పడిందట. దీంతో సినిమా క్లైమాక్స్‌ను కాస్త హ్యాపీగా ముగించాలని దర్శకుడు సురేందర్ రెడ్డిని కోరాడట చెర్రీ. అయితే కేవలం ఫ్యాన్స్ కోసం చరిత్రలో జరిగిన విషయాన్ని తమకు అనుకూలంగా మారిస్తే జనం ఎంతవరకు అంగీకరిస్తారు అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

ఏదేమైనా ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు అందరితీ సంప్రదింపులు జరపాలని విశ్లేషకులు చరణ్‌కు సలహా అందిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సైరా చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మరి చరణ్ చెప్పినట్లుగా సురేందర్ రెడ్డి ఈ చిత్ర కథను మారుస్తాడా లేక చరిత్రలో ఉన్నట్లుగానే తెరకెక్కిస్తాడా అనేది చూడాలి.

Share.