రకుల్ కష్టం చూస్తే షాక్ అవ్వాల్సిందే

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సైజ్ జీరో కోసం నానా పాట్లు పడుతుంది. బాలీవుడ్ కథానాయికల వలె మన హీరోయిన్స్ కూడా ఫిట్ నెస్ పై చాల శ్రద్ధ వహిస్తున్నారు. అందులోనూ రకుల్ దేశ వ్యాప్తంగా సొంతంగా అనేక జిమ్ సెంటర్లను ప్రారంభించింది, మరి కేవలం జిమ్ సెంటర్ ను ప్రారంభిస్తే సరిపోదు అనుకుందేమో తాను కూడా ఫిట్ గా ఉండాలి కదా అందుకే ఇంత కఠినతరమైన వ్యాయామాలు చేస్తుంది. ఇదిగో ఇలా సెలబ్రిటీ ఫిట్ నెస్ ట్రైనర్ మిస్టర్ హారిసన్ జేమ్స్ ఆధ్వర్యంలో ఇలా కఠోర వ్యాయామాలు ప్రయత్నిస్తుంది రకుల్.

ఇదో రకం టైర్ జిమ్. ఇందులో టైర్లతోనే కుస్తీలు పట్టాలి. ఈ వ్యాయామం చేయటం వలన శరీరం ఫిట్ గా ఉంటూ మనకు కావాల్సిన రీతిలో అందంగా మలచుకోవచ్చు. మరీ అంత హెవీ వెయిట్స్ ఎత్తాల్సిన పనేలేకుండా ఇలా టైర్లను ఎత్తేస్తూ రకుల్ చేస్తున్న ఎక్సర్ సైజులు కాస్తంత కొత్తగానే కనిపిస్తున్నాయి. రకుల్ తన అఫీషియల్ ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్న ఈ ఫిట్ నెస్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Share.