మన్మథుడు 2 సినిమాతో హాటీ బ్యూటీగా మారిపోయింది రకుల్‌ప్రీత్‌సింగ్. ఇప్పటి వరకు కుర్ర హీరోలతో ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేసిన రకుల్ ఇప్పుడు ఏకంగా సీనియర్ హీరోలతో రొమాన్స్‌కు సై అంటోంది. మన్మథుడు 2 సినిమాలో నాగార్జునతో రకుల్ హాట్ హాట్ కిస్‌లు, హగ్‌లు మామూలుగా లేవు. ఇక ఇప్పటికే హైదరాబాద్‌లో సోదరుడితో కలిసీ ఓ బ్రాండెడ్ జిమ్ బిజినెస్ స్టార్ట్ చేసిన రకుల్ ఇప్పుడు మరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టారు.
ఆమె టెన్నిస్ ప్రీమియర్ లీగ్ లో ఓ జట్టుకి కో-ఓనర్ గా మారారు. ఈ విషయాన్ని స్వయంగా రకుల్ సోషల్ మీడియా వేదికగా చెప్పింది. తాజాగా ఆమె తన ట్విట్టర్ లో ఆమె ‘ఫైన్ క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్’ జట్టును కొనుగోలు చేస్తున్నట్లుగా చెపుతూ ట్వీట్ చేసింది. ఐపీఎల్ స్పూర్తితో మొదలైన టిపిఎల్ ని టెన్నిస్ క్రీడాకారుడు మహేష్ భూపతి 2013లో స్థాపించడం జరిగింది.
ఈ యేడాది డిసెంబర్‌లో ఈ ఈవెంట్ జరగనుంది. ఈ క్రమంలోనే రకుల్ తన జట్టు సభ్యులను తన ఎనర్జీతో ఎంకరేజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే సినిమా వాళ్ల క్రికెట్ టోర్నమెంటులలో రకుల్ చేసిన హంగామా ? అంతా ఇంతా ? కాదు. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రస్తుతం హిందీతో పాటు తమిళ సినిమాల్లోనూ నటిస్తోంది.
ఇటు సినిమా రంగంలో రాణిస్తూనే టెన్నిస్ జట్టు ప్రాంచైజీలా మారి మరో కొత్త వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ కొత్త వ్యాపారం ఆమెకు ఎలా కలిసి వస్తుందో ? చూడాలి.