టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ , జాకీ బాగ్నాని గడచిన కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక సమయం దొరికితే చాలు కచ్చితంగా పార్టీలు, పబ్బులు అంటూ షికార్లు కొడుతూ ఉన్నారు. ఇక తన సమయాన్ని కూడా రకుల్ ఎక్కువగా ప్రియుడికే కేటాయిస్తూ ఉంటోంది.ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న కాస్త సమయం దొరకగానే జాకిని మాత్రం వదిలిపెట్టకుండా ఉంటుంది. ఇటీవలె తమ బాండింగ్ గురించి అధికారికంగా తెలియజేయడం జరిగింది. తన ప్రియుడు సమక్షంలో తన పుట్టినరోజు వేడుకలను కూడా చాలా ఘనంగా జరుపుకొని తమ మధ్య బంధాన్ని అందరికీ గుర్తు చేసింది రకుల్.
ఇక క్రిస్మస్ సందర్భంగా జాకీను ఉద్దేశించి శాంట ఇచ్చిన గిఫ్ట్ గా చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలో ఈ జంట కొత్త ఏడాది త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .ఇవన్నీ పెళ్లికి ముందే సంకేతాలు అంటూ ఎక్కువగా ప్రచారం జరుగుతోంది . వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ జంట వివాహ బంధంతో ఒకటి కాబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు బాగా వాయిదాలుగా మారుతున్నాయి. కేవలం మంచి రోజుల కోసమే ఎదురు చూస్తున్నారు అన్నట్లుగా సమాచారం.
ఇక రకుల్ కెరియర్ విషయానికి వస్తే చాలా స్పీడ్ తో బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తూ ఉంటోంది .కానీ ఈమెకు సరైన సక్సెస్ మాత్రం రాలేదు.బాక్సాఫీస్ వద్ద ఈమె చిత్రాలన్నీ నిరాశపరిచాయి. మరి వచ్చే ఏడాది అయినా ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాలతో సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి. ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు-2 చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రకుల్ పెళ్లికి సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.