రకుల్ ప్రీతిసింగ్ ఏంటి ఇలా మారిపోయింది.. ఫొటోస్ వైరల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ క్రమశిక్షణకు కేరాఫ్ అని ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తుంటుంది. ‘కెరటం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఫిట్‌నెస్ ఫ్రీక్ అని చెప్పొచ్చు. అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్న రకుల్ దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోస్‌తో యాక్ట్ చేసింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించింది. ఇక ఈ భామ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గానే ఉంటుంది.

తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటో షేర్ చేసింద. సదరు ఫొటోలో రకుల్ ప్రీత్ సింగ్ మొక్కజొన్న తింటున్నట్లు కనిపిస్తుంది. కాగా, ఆ ఫొటోను చూసి నెటిజన్లు ఈమె అసలు హీరోయినా? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే రోడ్ సైడ్ అమ్మాయిలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా నెట్టింట రకుల్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ భామ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘కొండ పొలం’ ఫిల్మ్‌లో ‘ఉప్పెన’ ఫేమ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్‌కు జోడీగా నటించింది. దీంతో పాటు ‘అక్టోబర్ 31 లేడీస్ నైట్, అటాక్, ఐలన్, మేడే, థ్యాంక్ గాడ్, డాక్టర్ జీ, ఇండయన్ 2’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.

Share.