టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. రకుల్ నటించిన నాన్నకు ప్రేమతో, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ధ్రువ, తదితర సినిమాలకు మంచి స్టార్ స్టేటస్ అందుకున్న రకుల్ కి గత కొద్ది రోజులుగా సౌత్ లో సరైన అవకాశాలు రాకపోవడంతో నార్త్ ఇండస్ట్రీలోకి షిఫ్ట్ అయింది.
ఈమెకి టాలీవుడ్ దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వకపోవడంతో ఈ ఇండస్ట్రీ నుంచి వేరే ఇండస్ట్రీకి మారింది. అయితే ఈమె మాత్రమే కాదు సినీ ప్రపంచంలో ఇది కామన్ ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో నటించడానికి కూడా డేట్స్ ఖాళీగా లేని రకుల్ ప్రీతిసింగ్ ప్రస్తుతం ఎవరు అవకాశాలు ఇస్తారా అని ఎదురుచూస్తోంది.రకుల్ ప్రీతిసింగ్ బాలీవుడ్ లోకి వెళ్లిన రెండు సంవత్సరాలలో దాదాపు పది సినిమాలు చేసింది. అయితే ఏ సినిమాలో పాత్ర కూడా ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ఇటు టాలీవుడ్ లోనూ అటు బాలీవుడ్ లోనూ పెద్దగా గుర్తింపు రాకపోవడంతో రకుల్ ఫీడ్ అవుట్ హీరోయిన్ గా మిగిలిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ నిర్మాత ఇంటి కోడలుగా ఒక వెలుగు వెలగాల్సిన రకుల్ ప్రీతిసింగ్ ఛాన్స్ మిస్ చేసుకుందట. ఇంతకు ఆయన ఎవరనుకున్నారా హీరో రానా దగ్గుపాటి. వీరిద్దరూ ఒక ఫంక్షన్ లో కలిసి రెండు సంవత్సరాల పాటు డేట్ చేశారనే విషయం అప్పట్లో తెగ వైరల్ గా మారింది.అంతేకాకుండా ఈ విషయంపై వీరు క్లారిటీ ఇవ్వలేదు. అప్పట్లో పబ్బులు పార్టీలు అంటూ ఇద్దరూ తెగ చెట్టాపట్టాలేసుకొని తిరిగారట.
కానీ అదే టైంలో రకుల్ సినిమాల బిజీలో పడి దర్శక నిర్మాతలతో అవకాశాల కోసం రాసుకొని పూసుకొని తిరిగేసరికి రానాకి నచ్చకపోవడంతో ఇద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి..ఒకవేళ వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఉంటే చూడముచ్చటైన జంటగా మిగిలేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. రాన ని వివాహ చేసుకో లేకపోవడంతో రకుల్ ఇప్పటికీ బాధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉంటాయి.