నటి త్రిష, హీరో విజయ్ సేతుపతి జంటగా నటించిన తాజా చిత్రం ” 96 ” అక్టోబర్ 4 వ తేదీన విడుదలై అన్ని ప్రాంతాల్లో హిట్ టాక్ తో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించగా గోవింద్ మీనన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు తమని తాము సినిమాలో హీరో హీరోయిన్ పాత్రల్లో ఊహించుకోవటం విశేషం. ఈ సినిమా లోని ప్రేమ కథ ఎంత అద్భుతంగా దర్శకుడు తెరకెక్కించాడో చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ. ఫిలిం ఇండస్ట్రీ లోని ఇతర నటీమణులు ఇప్పటికే ఈ సినిమా చూసి ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
తాజాగా నటి రకుల్ ప్రీత్ ఈ సినిమా చూసి ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియ చేసారు. రకుల్ ట్వీట్ చేస్తూ ” కొంచం లేట్ అయినా చివరికి 96 సినిమాని చూసా, ఇది ఒక అద్భుతమైన నిజమైన ప్రేమ కథ చిత్రం, ప్రతి ఒక్కరి హృదయంలో ఈ సినిమా నిలిచి పోతుంది. ఈ సినిమా చూస్తే నిజమైన ప్రేమ ఇంకా ఉంది అనే నమ్మకం కలుగుతుంది. త్రిష నటన ఈ సినిమాలో చాల అందంగా అద్భుతంగా ఉంది. హీరో విజయ్ మీకు హ్యాట్స్ ఆఫ్. సింగర్ చిన్మయి నువ్వు పాడిన కథలే పాటతో నా మనసు విరిగిపోయింది ” అంటూ అందరి పై ప్రశంసల జల్లు కురిపించారు నటి రకుల్.
Late but finally saw #96 ! What a beautiful honest film ❤️ it’s all heart !! Makes u believe that true love exists! @trishtrashers u ver amazingggg!! Effortlessly gorgeous.. @VijaySethuOffl hats off to u !dont miss this gem! @Chinmayi u tore my heart wd kaathale 😘😘
— Rakul Preet (@Rakulpreet) October 24, 2018