‘ రాజుగారి గ‌ది 3 ‘ ప్రి రివ్యూ

Google+ Pinterest LinkedIn Tumblr +

రాజుగారి గది – 2015లో చిన్న సినిమాగా విడువులై బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. హర్రర్ కామెడీ జానర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఓంకార్ డైరెక్ట్ చేశాడు. ఓంకార్ తొలి సినిమా ప్లాప్ కావ‌డంతో పాటు కంచె సినిమాకు పోటీగా ఈ సినిమా రావ‌డంతో రాజుగారి గ‌దిపై అంచ‌నాలు లేవు. అయితే మార్నింగ్ షో నుంచి క్ర‌మ‌క్ర‌మంగా ఫిక‌ప్ అయ్యింది. ఇక ఈ సినిమా హిట్ అవ్వ‌డంతో రెండో పార్టులో ఓంకార్ పెద్ద సాహ‌సం చేశాడు. సీర‌త్ క‌పూర్‌, స‌మంత‌, నాగార్జున లాంటి వాళ్ల‌ను పెట్టి భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించాడు.

సినిమా ఓ మోస్తరుగా ఉన్నా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాత్రం న‌ష్టాలు మిగిల్చింది. అయినా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిగా ఓంకార్ ఈ సీరిస్‌లో మూడో సినిమా తెర‌కెక్కించాడు. ఈ సినిమా ఈ శుక్ర‌వారం బాక్సాఫీస్ యుద్ధం ప్రారంభించ‌నుంది. ‘సైరా’ విడుదలయ్యాక బాక్స్ ఆఫీస్ దగ్గరసినిమాలు ఏమీ లేవు, విడుదలైన ఒకటి రెండు సినిమాలు ఆడలేదు.

ఈ లెక్క‌న రాజుగారి గ‌ది 3 సినిమాకు మంచి అడ్వాంటేజ్ ఉంది. రెండో పార్ట్ మెప్పించ‌క‌పోయినా రాజుగారి గ‌ది సీక్వెల్స్‌లో ఉండే ఎంట‌ర్టైన్‌మెంట్‌, హ‌ర్ర‌ర్ ఎలిమెంట్స్ ఉంటాయ‌న్న అంచ‌నాల‌తో రాజుగారి గ‌ది 3పై బ‌జ్ క్రియేట్ అయ్యింది. ఈ క్ర‌మంలోనే ‘రాజు గారి గది 3’ సినిమాకు మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఇప్పటికే ట్రైలర్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో 4-5 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకి బిజినెస్ కూడా గట్టిగానే అయ్యింది. అలాగే మొదటి రోజు 1.5 – 2 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తుందని అంచ‌నా వేస్తున్నారు.
అశ్విన్ బాబు, అవిక గోర్, అలీ, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. మ‌రి రాజుగారి గ‌ది 3 రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో ? చూడాలి.

Share.