రజినీకాంత్ రోబో 2 . 0 టీజర్

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ రజినీకాంత్, అమీ జాక్సన్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 2 . 0 టీజర్ ఈ రోజు వినాయక చవితి సందర్భంగా విడుదల చేసారు చిత్ర యూనిట్ సభ్యులు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రోబో కి సీక్వల్ గా వస్తుంది. బాలీవుడ్ యాక్టిన్ హీరో అక్షయ్ కుమార్ రోబో 2 . 0 లో ప్రతినాయక పాత్ర లో తన నట విశ్వరూపం చుపించారనేది టీజర్ ద్వారా స్పష్టం అవుతుంది. సినిమాలోని వీ ఎఫ్ ఎక్స్ మరియు గ్రాఫిక్స్ ప్రేక్షకులకి ఒక కొత్త అనుభూతిని కలిగించటం ఖాయం.

క్రోమ్యాన్ గా అక్షయ్ కుమార్ – చిట్టీ పాత్రలో రజనీ ఒకరితో ఒకరు పోటీపడి నటించారని టీజర్ చెబుతోంది. టీజర్ ద్వారా కథ ఏంటనేది అర్ధం అయిపోయింది. స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు, టీజర్ లోని నేపధ్య సంగీతం కూడా ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యిందని చెప్పాలి. దాదాపు 540 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Share.